టీడీపీలో సమూలన ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. సీనియర్ నాయకులను దూరం పెట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరగబోయే మహానాడులో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతల పెత్తనంతోనే ఈమేరకు మార్పులు అనివార్యమవుతుున్నాయని అందరు చెబుతున్నారు.
సీనియర్లను దూరం
పార్టీలో ఎన్టీఆర్ హయాంలో వచ్చిన నేతలు తమ పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. పార్టీ విధానాల్లో తమ మాట నెగ్గాలని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అందుకే చంద్రబాబు కొత్త రక్తం ఎక్కించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీనియర్ నేతలు నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించడంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. అధినేత ముందే తమ ఆవేశం వెల్లగక్కినట్లు తెలిసింది. దీంతో పార్టీలో మార్పులు చేయాల్సిందేనని పలువురు సూచించినట్లు తెలుస్తోంది.
యువతరం కోసం..
వయసు అయిపోయినవారిని పక్కన పెట్టి యువతరానికి అవకాశం ఇవ్వడానికి పార్టీ నాయకులు నిర్ణయిస్తున్నారు ప్రతిపనికి సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీంతో చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించగా సీనియర్ల ముందు ఆయన చిన్నవాడిగా కనిపించడంతోనే ఆయన మాటలకు విలువ ఇవ్వడం లేదు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీల బాటలో..
ఇప్పటికే పలు పార్టీలు నూతన తరహా విధానాలు అవలంభిస్తున్నాయి. దీంతో టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. కాంగ్రెస్ లో కూడా సీనియర్ల ఆధిపత్యమే నడుస్తోంది. ఫలితంగా పార్టీ ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో ఇతర పార్టీల కన్నా వెనుకంజలో పడిపోయింది. అందుకే ఆ గుణపాఠాలు నేర్చుకుని పార్టీని ముందుకు నడిపించే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. అందుకు కొత్త రక్తం అవసరమనే ధీమాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
మార్పుకే ప్రాధాన్యం
ఇన్నాళ్లు సీనియర్ నాయకుల మాటలు వినడంతోనే పార్టీ భవిష్యత్తు గందరగోళంలో పడింది. దీంతో పార్టీ ఎదుగుదల అగమ్యగోచరంలో పడిపోయింది. రాజకీయంగా పార్టీని ముందుకు నడిపించడంలో యువరక్తం అవసరం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.