https://oktelugu.com/

BJP- TDP- Jana Sena: టీడీపీ జూ.ఎన్టీఆర్ చేతికి.. చంద్రబాబు కొత్త పార్టీ.. పవన్ తో పొత్తు.. బీజేపీ ప్లాన్ లీక్?

BJP- TDP- Jana Sena: దేశంలోనే పవర్ ఫుల్ పెద్ద మనిషి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను హైదరాబాద్ లో కలిశాడో అప్పుడే బోలెడన్నీ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన రాజగురువు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటి అయ్యాక ‘ఏదో జరుగబోతోందన్న’ సందేహాలు వెలువడ్డాయి. అసలు వీరి మీటింగ్ వెనుక రహస్యం ఏంటన్న దానిపై బోలెడు చర్చోపచర్చలు సాగాయి.ఎవరికీ అంతుబట్టని […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2022 / 09:48 AM IST
    Follow us on

    BJP- TDP- Jana Sena: దేశంలోనే పవర్ ఫుల్ పెద్ద మనిషి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను హైదరాబాద్ లో కలిశాడో అప్పుడే బోలెడన్నీ ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన రాజగురువు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటి అయ్యాక ‘ఏదో జరుగబోతోందన్న’ సందేహాలు వెలువడ్డాయి. అసలు వీరి మీటింగ్ వెనుక రహస్యం ఏంటన్న దానిపై బోలెడు చర్చోపచర్చలు సాగాయి.ఎవరికీ అంతుబట్టని రాజకీయం వీరి భేటి ఉందని తాజాగా లీక్ అయ్యింది. ఏపీ మాజీ మంత్రి, జూ.ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

    chandrababu NTR

    -తెలుగుదేశం పార్టీని టేకోవర్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?
    కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప్లాన్ క్లియర్ కట్ గా ఉందని కొడాలి నాని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేతుల్లోంచి తీసేసి జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో పెట్టడమే బీజేపీ ప్లాన్ అని బాంబు పేల్చాడు. చంద్రబాబు నాయుడు ఎలాగైతే సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేశాడో అలాగే లాగేసి.. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు అప్పజెప్పుతారని సమాచారం.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోని టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఏపీలో ముందుకెళుతుందట.. చంద్రబాబు చేసేదేం లేక కొత్త పార్టీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాడన్నది కొడాలి నాని మాట.. ఎన్టీఆర్ కు సన్నిహితుడు కావడంతో అమిత్ షా ప్లాన్ కూడా ఇదేనంటూ చర్చ సాగుతోంది.

    Also Read: Gandhi Hospital: మత్తు ఇవ్వకుండానే స్మార్ట్‌ఫోన్‌లో సినిమా చూపించి ఆపరేషన్ చేసిన ‘గాంధీ’ ఆసుపత్రి వైద్యులు

    -చంద్రబాబుపై పగ.. పవన్ తో బీజేపీకి దూరం
    జూనియర్ ఎన్టీఆర్ ను పైకి తీసుకురావడానికి బీజేపీకి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. అందులో మొదటిది మోడీని గద్దెదించాలని 2019లో చంద్రబాబు చేసిన కుట్రలు.. కాంగ్రెస్ తో జట్టు కట్టి చేసిన వ్యూహాలన్నింటిని బీజేపీ పెద్దలు మరిచిపోలేదు. అందుకే ఏపీలో బాబుతో కలిసి పొత్తు పెట్టుకోవడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. ఫేడ్ అవుట్ అయిపోయిన చంద్రబాబు కంటే జూనియర్ ఎన్టీఆర్ బెటర్అని అతడిని రాజకీయాల్లోకి తేవడానికి బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ రోజురోజుకు బీజేపీకి దూరం అవుతూ.. చంద్రబాబుకు దగ్గరవుతూ ఒంటరిగా రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ బెటర్ అని బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

    BJP- TDP- Jana Sena

    బీజేపీ ప్లాన్ ఇదేనంటూ కొడాలి నానితోపాటు వైసీపీ పెద్దలు కూడా వ్యాపింపచేస్తున్నారు. దీన్ని బట్టి 2024 ఎన్నికల ముందర తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుందని.. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీచేస్తారని అంటున్నారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టి పవన్ తో కలిసి పోటీచేయబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇదంతా వైసీపీ పుట్టిస్తున్న ప్రచారమా? లేక నిజంగానే తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ టేకోవర్ చేస్తాడా? అన్నది భవిష్యత్తులోనే తేలనుంది.

    Also Read:Kuppam: కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు… చంద్రబాబుకు ఎంత కష్టమొచ్చే?

     

     

    Tags