https://oktelugu.com/

Mahaanadu: మీ ఆవేశం పాడుగానూ.. మహిళా నేతల తొడలు గొట్టుడు చూసి చంద్రబాబు అవాక్కు!

Mahaanadu: తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’. పార్టీని స్తాపించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. అంతకుముందు హైదరాబాద్ లో ఎన్టీఆర్ నివసించిన గండిపేట ఆశ్రమంలో మహానాడు మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగేది కానీ.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో దాన్ని ఏపీకి మార్చారు. పార్టీ పండుగ సందర్భంగా నిన్న చంద్రబాబు శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చాలా పెద్ద పెద్ద డైలాగులే వాడారు. సేవ్ ఏపీ., క్విట్ జగన్ అంటూ ఆంధ్రాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : May 28, 2022 / 03:16 PM IST
    Follow us on

    Mahaanadu: తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’. పార్టీని స్తాపించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. అంతకుముందు హైదరాబాద్ లో ఎన్టీఆర్ నివసించిన గండిపేట ఆశ్రమంలో మహానాడు మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగేది కానీ.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో దాన్ని ఏపీకి మార్చారు. పార్టీ పండుగ సందర్భంగా నిన్న చంద్రబాబు శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చాలా పెద్ద పెద్ద డైలాగులే వాడారు.

    సేవ్ ఏపీ., క్విట్ జగన్ అంటూ ఆంధ్రాలో జగన్ ను అధికారంలోంచి దించేస్తానంటూ శపథం చేశారు. ఇక అంతవరకూ ఓకే కానీ తర్వాత మాట్లాడిన మహిళా నేతల తీరు చూసే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

    ముఖ్యంగా మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ అయితే తెగ రెచ్చిపోయింది. ఏకంగా జగన్ దావోస్ వెళ్లి పెళ్లాంతో గడిపాడని తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ అయ్యిండి మరో మహిళా ఇంతటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేదు. ఇక సభా వేదికపైనే వైసీపీ నేతలను బస్సు యాత్రలో కిందకు దించి కొడుతానని ఈమె గారు తొడగొట్టడం గమనార్హం.

    ఎంత ఆవేశం ఉన్నా కూడా ఎ టీడీపీ మగ నేతలు కూడా ఇంతలా రెచ్చిపోలేదు. చంద్రబాబు మెప్పు కోసమో.. జనాల్లో ఫోకస్ కావడానికో కానీ మైక్ అందుకోగానే గీష్మ రెచ్చిపోయిన విధానం చూసి తెలుగు తమ్ముళ్లే ముక్కునవేలేసుకున్నారు.

    ఈ డోస్ ను మరింత కంటిన్యూ చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత కూడా అంతే ఘాటుగా రెచ్చిపోయారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఇది మహానాడుగా కంటే బూతుల నాడుగా మార్చేశారు.

    పద్ధతిగల మహిళా నేతలుగా ఉండి కూడా వీరు వాడిన భాష.. వేదికపైనే తొడగొట్టిన తీరు చూస్తే వైసీపీ నేతల కంటే డేంజర్ గానే కనిపిస్తున్నారు. వీరి భాషను అధినేత చంద్రబాబు సహా ఎర్రన్నాయుడు ఎవరూ ఇంత హార్ష్ గా వాడలేదు. కానీ వీరిద్దరూ మాత్రం రెచ్చిపోయి రొచ్చు చేశారు. సోషల్ మీడియాలో వీరి తొడగొట్టడాలు.. బూతులపై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది.

    Recommended Videos: