Chandrababu Pawan Kalyan: మహానాడు ఊపు చూశాక పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీకి ఉందా? లేదా?

Chandrababu Pawan Kalyan:మహానాడు ఊపు చూశాక తెలుగు తమ్ముళ్లలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ఇక్కడేకాదు లండన్, అమెరికాలోనూ పసుపు చొక్కాలు వేసుకొని తెలుగుదేశం జెండాలు పట్టుకొని సందడి చేసిన తెలుగోళ్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల కళ్లు చల్లబడ్డాయి. అయితే ఇన్నాళ్లు ఒంటరిగా గెలవలేమని.. పవన్ కళ్యాణ్ ‘ప్రేమ’ కోసం పరితపించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మహానాడు ఊపు చూసి ఎక్కడలేని విశ్వాసం తన్నుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం లేదంటూ […]

Written By: NARESH, Updated On : May 31, 2022 6:23 pm
Follow us on

Chandrababu Pawan Kalyan:మహానాడు ఊపు చూశాక తెలుగు తమ్ముళ్లలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ఇక్కడేకాదు లండన్, అమెరికాలోనూ పసుపు చొక్కాలు వేసుకొని తెలుగుదేశం జెండాలు పట్టుకొని సందడి చేసిన తెలుగోళ్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల కళ్లు చల్లబడ్డాయి. అయితే ఇన్నాళ్లు ఒంటరిగా గెలవలేమని.. పవన్ కళ్యాణ్ ‘ప్రేమ’ కోసం పరితపించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మహానాడు ఊపు చూసి ఎక్కడలేని విశ్వాసం తన్నుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం లేదంటూ వెర్రి వాగుడు వాగేస్తున్నారు. ఇంతకీ మహానాడు ఊపు చూశాక పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీకి ఉందా? లేదా? చంద్రబాబు ఒంటరిగా పోటీచేసి గెలవగలడా? లేదా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

-చంద్రబాబుది పొత్తుల చరిత్రనే..
చంద్రబాబు చరిత్రలో ఒంటరిగా గెలిచిన దాఖలాలు చాలా తక్కువ. తొలి దఫాలో మామ ఎన్టీఆర్ గెలిపించిన తెలుగుదేశం పార్టీని ఆయనకు వెన్నుపోటు పొడిచి హైజాక్ చేసిన చరిత్ర చంద్రబాబుది. గద్దెనెక్కగానే ఏపీ ప్రజలకు హైటెక్ మాయాజాలం చూపించి 1999లో మరోసారి గెలిచారు. ఇక ఆ తర్వాత రెండు దఫాల పాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజా వ్యతిరేక.. ముఖ్యంగా రైతుల వ్యతిరేకిగా ముద్ర వేయించుకొని రెండు సార్లు అధికారానికి దూరమయ్యారు. 2009లో మహానాడు పేరిట నాడు టీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఇతర చిన్నా చితక పార్టీలతో పోటీచేసినా చంద్రబాబు గెలవలేకపోయాడు. ఇక 2014లో రాష్ట్రం విడిపోవడం.. చుక్కాని లేని నావలా ఉన్న ఏపీని రక్షించేందుకు ప్రజలు కూడా అప్పటికే కేంద్రంలో బీజేపీ వస్తుందన్న అంచనాలతో చంద్రబాబు-మోడీ-పవన్ కళ్యాణ్ పొత్తుల కూటమికి మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చుండబెట్టారు. 2019లో పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడం.. బీజేపీతో గొడవ పెట్టుకొని ఒంటరిగా వెళ్లిన చంద్రబాబుకు దారుణ ఓటమి. ఏకంగా 23 సీట్లకే పరిమితమై టీడీపీ చరిత్రలోనే అపజయాన్ని చవిచూశారు. వైసీపీ 151 సీట్లు గెలిచి బలంగా అవతరించింది. ఇప్పుడు జగన్ ఎత్తులకు చిత్తు అవుతూ పార్టీని కాపాడుకునేందుకు మరోసారి పవన్ కళ్యాణ్ తో పొత్తుకు చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: Attack On Mallareddy: మల్లారెడ్డిపై దాడి: కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత వల్లేనా?

-వాపును చూసి బలుపు వద్దు
మహానాడుకు ఈసారి మునుపటికంటే బాగా ఊపు వచ్చింది. లక్షల మంది జనాలు వచ్చారు. అదంతా టీడీపీపై అభిమానంతో మాత్రం కాదు. కేవలం వైసీపీపై, జగన్ పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రతిపక్ష టీడీపీ సభకు జనాలు వెల్లువెత్తారు. ఎన్టీఆర్ కుటుంబం, అభిమానులు అండగా నిలిచారు. చంద్రబాబుకు ఈ ఊపు చూసుకొని చాలా ధైర్యం వచ్చింది. టీడీపీ నేతలు కూడా ఇక పవన్ కళ్యాణ్ అవసరం లేదని సోషల్ మీడియాలో, బయటా అవాకులు చెవాకులు పేలుతున్నారు. నిజానికి చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన చరిత్ర లేదు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తునో.. లేక ఏదైనా ప్రముఖ పార్టీలు, వ్యక్తుల నీడలోనో ఆయన గెలిచేశారు. సొంతంగా గెలిచింది చాలా తక్కువ. ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను టీడీపీనే కాదు.. జనసేన కూడా అనుకూలంగా మలుచుకుంటోంది. అందుకే ఇప్పుడు ఈ వాపును చూసుకొని బలుపుగా ముందుకెళ్లి పవన్ కళ్యాణ్ ను కాదనుకుంటే మరోసారి చంద్రబాబు ప్రతిపక్షానికే పరిమితం అవ్వడం ఖాయం.

-పవన్ ప్రతిపక్ష పాత్ర
ఇప్పుడు వైసీపీని ధైర్యంగా ఎదుర్కొనే ప్రధాన ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. అదే సమయంలో జగన్ ఎత్తులకు చిత్తవుతూ చంద్రబాబు ఏడుపు లఖించుకున్నాడు. పవన్ నే ప్రజలు తమ బలమైన ప్రతిపక్ష నేతగా భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కలిస్తే ఖచ్చితంగా 2024లో గెలుపు సాధ్యం. కానీ వాపును చూసుకొని చంద్రబాబు పొత్తు పెట్టుకోకముందుకెళితే మాత్రం మరోసారి టీడీపీ నిండా మునగడం ఖాయం. జగన్ లాంటి బలమైన నేతను, పార్టీని ఓడించాలంటే ప్రస్తుతం చంద్రబాబు ఒక్కడితో కాదు. మరి ఈ విషయాన్ని గ్రహించి పవన్ కళ్యాణ్ తో వెళతాడా? ఒంటరిగా వెళ్లి చేతులు కాల్చుకుంటాడా? అన్నది వేచిచూడాలి.

Also Read: Counterfeit Currency: పెద్దనోట్ల రద్దు.. విఫల ప్రయత్నమే.. ఆరేళ్ల తర్వాత కూడా ఫలితమివ్వడి డీమానిటైజేషన్‌!

Recommended Videos: