Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: కొడాలి నాని సవాల్‌కు కౌంట‌ర్ వేసిన టీడీపీ.. అడ్డంగా బుక్ చేసిందిగా..!

Kodali Nani: కొడాలి నాని సవాల్‌కు కౌంట‌ర్ వేసిన టీడీపీ.. అడ్డంగా బుక్ చేసిందిగా..!

Kodali Nani: ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు కొనసా..గుతూనే ఉన్నాయి. ఇటీవల తాను గుడివాడలో కేసినో నిర్వహించినట్లు నిరూపిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. కాగా, ఆ సవాలును టీడీపీ స్వీకరించింది. కేసినో నిర్వహించారనే దానికి అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పిన టీడీపీ ఆధారాలను బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు, లింకులను విడుదల చేసింది.

Kodali Nani
Kodali Nani

యాసెస్ కేసినో అనే కంపెనీ గుడివాడలో మూడు రోజుల పాటు కేసినో నిర్వహించిందని, సంక్రాంతి పండుగ అయిన 15న సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేసిందని టీడీపీ నేతలు వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఉందని, ఇదిగో ఆ వీడియో అంటూ.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ యాసెస్ కేసినో నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ప్రిమాల్ టోపీవాలా అనే వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టును మీడియాకు టీడీపీ నేతలు విడుదల చేశారు.

Also Read:  పవన్ కెరీర్లోనే ‘భీమ్లా నాయక్’ బెస్ట్ అట.. థమన్ షాకింగ్ కామెంట్స్ !

అలా కేసినో‌కు సంబంధించిన రెండు వీడియోలు స్పష్టంగా ఉన్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. మూడు రోజుల పాటు వైసీపీ వారు కేసినో నిర్వహించినట్లు ఆధారాలివేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలతో వైసీపీపైన ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు. డీజీపీకి కంప్లయింట్ చేస్తామని, అయితే, తమకు పోలీసు వ్యవస్థపైన నమ్మకం లేదని, వారు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తెలియదని చెప్తున్నారు.

Kodali Nani
Kodali Nani

తాము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మొత్తంగా ఏపీలోని రాజకీయ వాతావరణం ఈ కేసినో వ్యవహారంతో ఇంకా వేడెక్కిందని చెప్పొచ్చు. అధికార వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వైరం ఇంకా ముదురుతున్నది. మంత్రి కొడాలి నాని సవాల్ మేరకు టీడీపీ నేతల ఆధారాల సమర్పణ జరిగింది. అయితే, టీడీపీ నేతలు సమర్పించిన ఆధారాలపైన కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం కానుంది. కొడాలి నాని గతంలో టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఇకపోతే కేసినో నిర్వహించినట్లు వైసీపీ నేతలు కొందరు ఆఫ్ ది రికార్డు చెప్తున్నట్లు సమాచారం.

Also Read: ఈ యాక్ట‌ర్ల‌ను స్టార్ డైరెక్ట‌ర్లు సెంటిమెంట్ గా భావిస్తున్నారు తెలుసా..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version