Chandrababu: ఆ మాజీ న్యాయమూర్తులు జగన్ కు అందుకే సపోర్టు చేశారట.. ఇదేం న్యాయం చంద్రబాబూ?

Chandrababu: తాము చేస్తే సంసారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అంటేనే తేడా.. ఎవరు చేసినా అది సంసారమే.. కానీ మీడియా, పలుకుబడి.. తిమ్మిని బమ్మిని చేసే గుణం ఉంటే ఏది ఆరోపించినా ఒప్పు అవుతుందా? అంటే అవ్వదు. బలమైన ప్రత్యర్థి ముందు ఉంటే అస్సలే వీలుకాదు.. ఇప్పుడు చంద్రబాబు గావుకేకలు చూశాక అందరూ ఇదే అంటున్నారు. ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఏపీలో ‘న్యాయాన్యాయాల’పై మాట్లాడడం చూసి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్లు ఏపీ […]

Written By: NARESH, Updated On : December 16, 2021 12:10 pm
Follow us on

Chandrababu: తాము చేస్తే సంసారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అంటేనే తేడా.. ఎవరు చేసినా అది సంసారమే.. కానీ మీడియా, పలుకుబడి.. తిమ్మిని బమ్మిని చేసే గుణం ఉంటే ఏది ఆరోపించినా ఒప్పు అవుతుందా? అంటే అవ్వదు. బలమైన ప్రత్యర్థి ముందు ఉంటే అస్సలే వీలుకాదు.. ఇప్పుడు చంద్రబాబు గావుకేకలు చూశాక అందరూ ఇదే అంటున్నారు.

Chandrababu

ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఏపీలో ‘న్యాయాన్యాయాల’పై మాట్లాడడం చూసి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్లు ఏపీ సీఎం జగన్ తనకు అ‘న్యాయం’ జరుగుతోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాసి.. అందరితోనూ వాపోతూ బాధపడ్డారు. దానికి టీడీపీ, చంద్రబాబులు కౌంటర్లు ఇచ్చారు. జగన్ కు ‘న్యాయం’ కనపడడం లేదన్నారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయ్యింది.

ఏపీ హైకోర్టు తీరుపై ‘జైభీం ఫేమ్’.. మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తీవ్ర విమర్శలు చేశారు. అది వైరల్ అయ్యింది. జగన్ సర్కార్ వాదనకు బలం చేకూరింది. ఓ సుప్రీంకోర్టు జడ్జి సైతం జగన్ సర్కార్ కు అనుకూలంగా.. ఏపీ హైకోర్టు తీరుకు వ్యతిరేకంగా మాట్లాడేశారు.

Also Read: చంద్రబాబు, పవన్ మళ్లీ కలవబోతున్నారోచ్!

ఈ క్రమంలోనే వారిద్దరిపై పడ్డారు చంద్రబాబు.. గతంలో ఇదే పని జగన్ చేస్తే తప్పు అన్న చంద్రబాబు ఇప్పుడు జగన్ కు సపోర్టు చేసిన మాజీ న్యాయమూర్తులపై విమర్శలు గుప్పించారు. వాటి వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పేసి సంచలనం సృష్టించారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఏపీ హైకోర్టుపై జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల వెనుక పదవుల కారణమే ఉందని చంద్రబాబు ఆరోపించడం గమనార్హం. జగన్ సర్కార్ లో పదవులు ఆశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రిటైర్ అయిన తర్వాత వీళ్లకు పదవులు కావాలని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ .. ఆయన కుమారుడికి పదవి తీసుకొని జగన్ ను పొగుడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఇప్పుడు జస్టిస్ చంద్రు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.

నిజానికి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన కింగ్ మరొకరు లేరనే టాక్ ఉంది. 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో చంద్రబాబుపై ఒక్క కేసు కూడా నిలబడలేదంటారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ కు మద్దతుగా నిలబడ్డ ఇద్దరు న్యాయమూర్తులపై ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తనదాకా వస్తే కానీ ఈ బాధ చంద్రబాబుకు తెలియదా?అని కౌంటర్లు పడుతున్నాయి. తనను పొగిడితే మంచోళ్లు.. ప్రత్యర్థిని పొగిడితే అనుకూలంగా నిలిస్తే వాళ్లు చెడ్డవారా? అన్న వాదన వినిపిస్తోంది.

Also Read: జస్టిస్ చంద్రు కామెంట్స్ మీద చంద్ర‌బాబు క్లారిటీ.. అందుకే అలా అన్నార‌ట‌..!

Tags