https://oktelugu.com/

రూట్‌ మార్చిన టీడీపీ..: టార్గెట్‌ తిరుపతి

తిరుపతి ఉప ఎన్నికను ఏపీలోని ప్రతీ పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలుపొంది ఎవరి సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం అందరికంటే ఓ అడుగు ముందే ఉంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటాలని చూస్తోంది. ఇక్కడ గెలిచి ఫ్యూచర్‌‌ ఎన్నికలకు రెడీ కావాలని ఆరాటపడుతోంది. అందుకే ఇప్పటికే దూకుడు పెంచింది. అభ్యర్థిని ప్రకటించింది. ఇక తనదైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. Also Read: […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 2:01 pm
    Follow us on

    TDP
    తిరుపతి ఉప ఎన్నికను ఏపీలోని ప్రతీ పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలుపొంది ఎవరి సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం అందరికంటే ఓ అడుగు ముందే ఉంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటాలని చూస్తోంది. ఇక్కడ గెలిచి ఫ్యూచర్‌‌ ఎన్నికలకు రెడీ కావాలని ఆరాటపడుతోంది. అందుకే ఇప్పటికే దూకుడు పెంచింది. అభ్యర్థిని ప్రకటించింది. ఇక తనదైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

    Also Read: వారందరికీ సీబీఐ నోటీసులు..: ఎందుకంటే..?

    అంతేకాదు.. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిలో కూడా ఇన్‌చార్జీలను నియమించింది. ఇప్పటికే నేతలు రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసంలో టీడీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి.. ఎలా ముందుకెళ్లాలనేది ప్రధానంగా చర్చించారట.

    తిరుపతి లోక్‌సభ పరిధిలో నియోజకవర్గాలను ఇన్‌చార్జీలను పంపాలని నిర్ణయించారు. 10 బూత్‌లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రచారం, గ్రామ పర్యటనలు చేయాలని, నేతల అందరూ నియమించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. వ్యూహాలను సిద్ధం చేయాలని సూచనలు చేశారు. పార్టీ విజయం కోసం అందర్ని సమన్వయం చేసుకుంటూ కలసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

    Also Read: బీజేపీలో చేరేందుకు సినీ గ్లామర్ల క్యూ

    తిరుపతి సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాకపోయినా టీడీపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని రంగంలోకి దించారు. ఇటు వైఎస్సార్‌సీపీ కూడా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి కాకుండా ప్రముఖ వైద్యులు గురుమూర్తిని పోటీ చేయించాలని భావిస్తోందట. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ పార్టీ నేతలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు జనసేన-బీజేపీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. చివరకు ఈ ఎన్నికల్లో ఎవరిని గెలుపు వరిస్తుందో కానీ ఈ ఉప ఎన్నిక మాత్రం రసవత్తరంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్