Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోకుండా.. వ్యక్తిగతంగా టార్గెట చేస్తోంది. ఇందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేతలపై అసత్య ప్రచారంతో చర్చ చేసింది. అసెంబ్లీ వేదికగానే చంద్రబాబునాకుడు కుటుంబ సభ్యులను అవమానించేలా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. దీంతో చంద్రబాబు అసెంబ్లీకి రావడమే మానేశారు. ఇక ఏపీలో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అధికార పార్టీ టార్గెట్ చేసింది. ప్రజా సమస్యలపై జనసేనాని సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. ‘నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని రజినీకాంత్ చెప్పినట్లు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రజాసమస్యలపై అధికార పార్టీని కడిగి పాడేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్.. అధికార పక్షంగా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మూకుమ్మడిగా ఎదురు దాడి చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాల్లో పోస్టులు..
ఒక వైపు మీడియా వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గట్ చేస్తున్న అధికార వైసీపీ నేతలు తాజాగా సోషల్ మీడియాలోనూ జనసేనాని టార్గట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేలా పస్టులు పెడుతున్నారు. ఉన్నవి లేనివి కలబోసి అసత్య ప్రచారం చేస్తున్నారు.
– ‘పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రూ.2వేల కోట్ల బ్లాక్ మనీని వైట్‌గా మార్చాలనే ప్లాన్‌లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి.. చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి దానిని వైట్‌గా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు’అని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్టు చేసింది.
– ఇటీవలే పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో రూ.130 కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్నారని.. పార్టనర్ ప్యాకేజీ అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇచ్చాయి. సినిమాలు ఏమీ చేయకుండా వందల కోట్ల రూపాయలతో ఇల్లు ఎలా కొంటారంటూ కూడా వ్యాఖ్యలు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్.
జనసైనికుల కౌంటర్ ఎటాక్..
దానికి కౌంటర్‌గా జనసేనకు చెందిన వ్యక్తి ‘మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు.. ఎన్నాళ్లు జనసేనను ఎదగనీకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారు.. జనసేన అంటే ఎందుకంత భయం?’ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తప్పుడు ప్రచారంపై జనసేన అభిమానులు, కార్యకర్తలు అగ్గిపై గుగ్గిలం అవుతున్నారు. వీటన్నింటిపైనా పోలీసులకు కంప్లయింట్స్ చేయాలని నిర్ణయించింది జనసే. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు లీగల్ నోటీసులు ఇవ్వాలని జన సేనాని పార్టీ శ్రేణులకు సూచించారు.
వ్యక్తిగత ఆరోపణలు..
ఇక జనసేనానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పరామర్శించారు. దీనిని కూడా వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు వద్ద జగన్ చేతులు కట్టుకుని ఉండడాన్ని ఊడా తప్పుడుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. సనిమా షూటింగ్స్ సందర్భంగా హీరోయిన్స్, అభిమానులతో దిగిన సెల్ఫీ ఫొటోల వీడియోలనూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలు వైరల్ చేస్తూ తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ పెళ్లిళ్లపై మాత్రం వైసీపీ పూర్తిగా దిగజారుడు రాజకీయం చేస్తోంది. చివరకు మహిళా కమిషన్‌తో నోటీసులు కూడా ఇప్పించే స్థాయికి దిగజారింది.

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే..
ఏపీలో జనసేనకు ప్రజాదరణ పెరుగుతోంది. 2019 నాటితో పేలిస్తే ప్రజల్లో జనసేనపై నమ్మకం పెరిగింది. ప్రజాసమస్యలపై జనసేనాని చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నారు. ప్రభుత్వ సర్వేలో కూడా ఇది తేటతెల్లమైంది. దీంతో పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది. జనసేనాని ఎక్కడైనా పర్యటిస్తే అక్కడ అడ్డుకోవడం, ప్రజలను కలుసుకోకుండా పోలీసులను ప్రయోగిస్తోంది. సభలకు కరెంటు కట్ చేస్తోంది. జనసేనా కార్యకర్తలను రెచ్చగొట్టి పవన్‌ను అడ్డుకునేలా పూరమాయిస్తోంది.
చీప్ ట్రిక్కులతో అభాసుపాలు..
ఒక జనసేనానిని కట్టడి చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు, అధికార దుర్వినియోగం, పోలీసు ప్రయోగాన్ని జన సైనికులు కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఇటీవల సమావేశాలకు పవర్ కట్‌చేయడంపై జనసైనికులు విస్తృతంగా ప్రచారం చేశారు. అభిమానుల సెల్ ఫోన్ల లైట్లలోనే ర్యాలీ చేసిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. విశాఖ ఎపిసోడ్‌లోనూ పవన్‌ను అడ్డుకోవడం ద్వారా వైసీపీ అభాసుపాలైంది. పవన్‌ను అడ్డుకునేందుకు వందల మంది పోలీసులను మోహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జన నేతగా పవన్‌ను ప్రజలు ఆదరిస్తుంటే.. జగన్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ విమర్శలపాలవుతోంది.