https://oktelugu.com/

Taraka Ratna : అవన్నీ అపోహలే… తారకరత్న హెల్త్ పై బాంబు పేల్చిన డాక్టర్స్, షాక్ లో ఫ్యాన్స్!

Taraka Ratna Health update : తారకరత్న కోలుకుంటున్నారన్న వార్త నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపింది. ఆదివారం ఉదయం వరకు నిస్పృహలో ఉన్న అభిమానులకు సాయంత్రం నుండి ఊపందుకున్న ప్రచారం ఉత్సాహమిచ్చింది. తారకరత్న హెల్త్ మెరుగైంది. ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారన్న సోషల్ మీడియా పోస్ట్స్ చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రచారానికి కుటుంబ సభ్యుల కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. తారకరత్న బాడీలోని ప్రధాన అవయవాల పనితీరు మెరుగవుతుంది. కోలుకుంటున్న సూచనలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 30, 2023 / 10:23 PM IST
    Follow us on

    Taraka Ratna Health update : తారకరత్న కోలుకుంటున్నారన్న వార్త నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపింది. ఆదివారం ఉదయం వరకు నిస్పృహలో ఉన్న అభిమానులకు సాయంత్రం నుండి ఊపందుకున్న ప్రచారం ఉత్సాహమిచ్చింది. తారకరత్న హెల్త్ మెరుగైంది. ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారన్న సోషల్ మీడియా పోస్ట్స్ చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రచారానికి కుటుంబ సభ్యుల కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. తారకరత్న బాడీలోని ప్రధాన అవయవాల పనితీరు మెరుగవుతుంది. కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. నేడు కొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉంటే వెంటిలేటర్ సపోర్ట్ కూడా తొలగించనున్నారని చెప్పుకొచ్చారు.

    దీంతో తారకరత్న దాదాపు కోలుకున్నట్లే. ఆయన పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారని అభిమానులు అంతులేని సంతోషం ప్రకటించారు. అయితే అధికారికంగా విడుదలైన తారకరత్న హెల్త్ బులెటిన్ నిరాశపరిచింది. నారాయణ హృదయాలయ వైద్యులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో… ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం ఉంది. ఆయనకు వెంటిలేటర్ తో పాటు ఇతర లైఫ్ సప్పోర్ట్స్ సిస్టమ్స్ అమర్చాము. అయితే కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నట్లు తారకరత్నకు ఎక్మో ట్రీట్మెంట్ జరగలేదు.

    తారకరత్న హెల్త్ కండిషన్ కి సంబంధించిన ప్రతి అంశం కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. వైద్యులుగా తారకరత్నకు ట్రీట్మెంట్ విషయంలో మాకు ప్రైవసీ ఇవ్వండి. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి… అని వెల్లడించారు. దీంతో తారకరత్న కోలుకున్నాడన్న వార్తలు వట్టి పుకార్లే అని తేలింది. ఈ క్రమంలో తారకరత్న కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

    హీరో తారకరత్న జనవరి 27న యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్ తో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుప్పం స్థానిక ఆసుపత్రిలో ఆయనకు ప్రాధమికంగా చికిత్స జరిగింది. బెంగుళూరు నుండి ఎక్స్పర్ట్ వైద్యులు కుప్పంకు రప్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు బెంగుళూరు తరలించారు. గత మూడు రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. ఇరవై మందికి పైగా ఉన్న వైద్య బృందం తారకరత్న ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారు. కార్డియాక్, కిడ్నీ, బ్రెయిన్ ఎక్స్పర్ట్స్ వారిలో ఉన్నారని సమాచారం. నిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లి తారకరత్నను సందర్శించారు.