https://oktelugu.com/

Tamil Star Hero: వైసీపీ MLA గా పోటీ చెయ్యబోతున్న తమిళ స్టార్ హీరో

Tamil Star Hero: మన టాలీవుడ్ లో తమిళ స్టార్ హీరోలకు కొంతమందికి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే..రజినీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కి దశాబ్దాల నుండి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది..వాళ్ళ తర్వాత నేటి తరం లో సూర్య, విక్రమ్ మరియు కార్తీ వంటి హీరోలకు మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు..వీరితో పాటుగా తమిళ హీరో విశాల్ రెడ్డి కి కూడా ఇక్కడ సూపర్ క్రేజ్ ఉంది..అయన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 28, 2022 / 04:52 PM IST

    Star Hero

    Follow us on

    Tamil Star Hero: మన టాలీవుడ్ లో తమిళ స్టార్ హీరోలకు కొంతమందికి మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే..రజినీకాంత్ మరియు కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కి దశాబ్దాల నుండి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది..వాళ్ళ తర్వాత నేటి తరం లో సూర్య, విక్రమ్ మరియు కార్తీ వంటి హీరోలకు మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు..వీరితో పాటుగా తమిళ హీరో విశాల్ రెడ్డి కి కూడా ఇక్కడ సూపర్ క్రేజ్ ఉంది..అయన నటించిన పందెం కోడి, పొగరు, పిస్తా, భరణి, డిటెక్టివ్ మరియు అభిమన్యుడు వంటి సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఒక్కప్పుడు మన తెలుగు లో విశాల్ సినిమా వస్తుంది అంటే మాములు క్రేజ్ ఉండేది కాదు..అదిరిపొయ్యే ఓపెనింగ్స్ వచ్చేవి..కానీ మధ్యలో వరుసగా ఫ్లాప్స్ రావడం తో విశాల్ మార్కెట్ కాస్త డౌన్ అయ్యింది..అయితే ఇన్ని రోజులు కేవలం సినీ హీరోగా మాత్రమే మనకి సుపరిచితమైన విశాల్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మన ముందుకి రాబోతున్నాడు..రాబొయ్యే 2024 సార్వత్రిక ఎన్నికలలో విశాల్ రెడ్డి వైసీపీ పార్టీ తరుపున నుండి పోటీ చెయ్యబోతున్నట్టు గత కొద్దీ రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

    Vishal Reddy

    Also Read: Star Hero In Ram boyapati Movie: రామ్ సినిమాలో మరో స్టార్ హీరో.. బోయపాటి ప్లానింగ్ మాములుగా లేదుగా!

    విశాల్ కి మొదటి నుండి YSR ఆంటే విపరీతమైన అభిమానం ఉన్నది..ఎన్నో సందర్భాలలో ఆయన YSR గురించి గొప్పగా మాట్లాడి ఉన్నాడు..అలాగే జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత కూడా పలు సందర్భాలలో ఆయన జగన్ పాలన గురించి అద్భుతంగా మాట్లాడాడు..ఇవి మాత్రమే కాకుండా తమిళనాడు లో ఏ విపత్తు వచ్చిన ముందుగా స్పందించి జనాలకు ఆసరాగా నిలిచే మొట్టమొదటి హీరో విశాల్ మాత్రమే..తనలో ఉన్న ఈ భావజాలమే అతి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేస్తుంది అని కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట..అతి త్వరలోనే ఆయనని జగన్ ని కలిసి వైసీపీ పార్టీ లో చేరబోతున్నాడు అని తెలుస్తుంది..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే విశాల్ ని కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయించేందుకు ఇప్పటి నుండే పావులు కడుపుతున్నాడట జగన్..ఇక్కడ దశాబ్దాల నుండి చంద్ర బాబు నాయుడు గారు పోటీ చేస్తూ MLA గా గెలుస్తున్నాడు..అయితే ఈసారి కుప్పం లో చంద్రబాబు నాయుడు ని ఓడించడమే లక్ష్యం గా పెట్టుకున్న జగన్..ఇందుకు విశాల్ ని ఆ స్థానం నుండి పోటీ చేయించడమే సరైన నిర్ణయం అని భావిస్తున్నాడట..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

    Vishal

    Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో ఎఫైర్: శోభిత మిడిల్ ఫింగర్ ఫొటో వైరల్

    Tags