PM Modi- KCR And Stalin: అస్తమానం రాజకీయాలేనా.. ఆ స్టాలిన్‌ను చూసి నేర్చుకో కేసీఆర్‌

PM Modi- KCR And Stalin: ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ రైలును ప్రారంభించి వెళ్లారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాలేదు. రైల్వే శాఖ కార్యక్రమం కాబట్టి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి కేంద్రం అధికారికంగా ఆహ్వానం ఇచ్చింది. మాట్లాడేందుకు ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించింది. కానీ ఏం జరిగింది? ఎప్పటిలాగే కేసీఆర్‌ రాలేదు. తన తరఫున రాష్ట్ర […]

Written By: K.R, Updated On : April 8, 2023 6:47 pm
Follow us on

PM Modi- KCR And Stalin

PM Modi- KCR And Stalin: ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు వచ్చారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ రైలును ప్రారంభించి వెళ్లారు. ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాలేదు. రైల్వే శాఖ కార్యక్రమం కాబట్టి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి కేంద్రం అధికారికంగా ఆహ్వానం ఇచ్చింది. మాట్లాడేందుకు ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించింది. కానీ ఏం జరిగింది? ఎప్పటిలాగే కేసీఆర్‌ రాలేదు. తన తరఫున రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ కూడా వేశారు. కేసీఆర్‌ రాలేదు కాబట్టి కుర్చీ కూడా ఖాళీగా ఉంది.

గతంలో పీఎం రాష్ట్రానికి వచ్చినప్పుడు తనకు ఆహ్వానం అందలేదని ముఖ్యమంత్రి అలిగారు. తన భజన మీడియాలో, తన భజనపరులతో మోదీ మీద రకరకాల వ్యాఖ్యానాలు చేయించారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో అయితే చెప్పతీరు కాని విమర్శలు చేయించారు. మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. కానీ ఇప్పుడు ఆహ్వానం పలికినా రాలేదు. ఇదేమన్నా పీఎం ఇంట్లో కార్యక్రమమా? లేక ఆయన పార్టీ కార్యక్రమమా? అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్నప్పుడు ఈ నిరసనలేమిటీ? ఇలా చేసే కదా కేసీఆర్ గురువు చంద్రబాబు “23” దగ్గర ఆగిపోయింది. కొద్ది రోజుల పాటు కేంద్రంతో అంటకాగి, తర్వాత తనకు అలవాటయిన అవకాశవాద రాజకీయాలు ప్రదర్శించింది, కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయింది, దేశంలోని ఆ సోకాల్డ్‌ ప్రతిపక్షాలను దగ్గర చేసింది, తర్వాత ఏమైంది, ఇవ్వాళ జగన్‌ కొట్టే దెబ్బలకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కంట నీరు పెడుతోంది. ఇది తెలియట్లేదా కేసీఆర్‌కు..

PM Modi- Stalin

ఎస్‌.. మోదీతో కేసీఆర్‌కు పడదు. అది రాజకీయం. కానీ ఇవ్వాళ వచ్చిన దాంట్లో ఉంది అభివృద్ధి కోణం. అడగందే అమ్మయినా పెట్టదు. కేంద్రం అడగకుండా నిధులు ఎలా ఇస్తుంది? ఆహ్వానం పలికినా కేసీఆర్‌ వెళ్లలేదు ఎందుకు? బాధ్యత గల ముఖ్యమంత్రిగా వెళ్లాలి కదా! రాష్ట్రానికి ఏం కావాలో అడగాలి కదా! పది మందిలో నిలదీయాలి కదా! ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడం, రాహుల్‌ వంటి దీ హిందూ విలేకరులను గేలి చేయడం ఏం హుందా తనం అనిపించుకుంటుంది? తెలంగాణకు నిధులు కావాలి, ఇతరత్రా అభివృద్ధి పనులు కావాలి.. అలాంటివి అడగాలి అనుకున్నప్పుడు ఇలాంటి వేదికలను అవకాశాలుగా వాడుకోవాలి. అంతేకానీ మోదీ సభకు వెళ్లకుండా పోవడం ఏం రాజనీతిజ్ఞత, 80,000 పుస్తకాలు నేర్పింది ఇదేనా?

ఇటీవల ప్రధానమంత్రి చెన్నై వెళ్లినప్పుడు అక్కడి డీఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు ఆహ్వానం పలికితే వెళ్లాడు. చెన్నై రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. మోదీ ప్రసంగించిన తర్వాత మాట్లాడాడు. తన రాష్ట్రానికి ఏం కావాలో అడిగాడు, తన సమస్యలు చెప్పాడు, కేంద్రంతో ఎక్కడ గ్యాప్‌ వస్తోందో వివరించాడు. రాజకీయ నాయకుడిగా హుందాతనాన్ని ప్రదర్శించాడు. అంతే కాదు మోదీకి ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికాడు. వెళ్లే దాకా కూడా ఉన్నాడు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పాడు. అంతేకానీ మోదీ పర్యటనకు వెళ్లకుండా ఉండలేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టలేదు, పోస్టర్లు అంటించలేదు, రెడీమేడ్‌ ఆందోళనలు చేయించలేదు. తన సొంత పత్రిక మురసోలిలో రకరకాల వార్తలు రాయించలేదు. అన్నట్టు ఈ స్టాలిన్‌ కూడా మోదీకి వ్యతిరేక కూటమే, ఆ కాంగ్రెస్‌ ఫోల్డ్‌లోని వ్యక్తే, కానీ ఎంత తేడా!