Minister Talasani: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్‌పైన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూవీ థియేటర్ల నిర్వహణపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటిపై మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మూవీ థియేటర్స్‌పైన ఎటువంటి ఆంక్షలు ఉండబోవని తెలిపారు.‘అఖండ, పుష్ప’ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటున్నదని పేర్కొన్నారు.

తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచామని, ఐదో ఆటకు కూడా పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. చిత్రానికి మతం, కులం, ప్రాంతాలు ఉండబోవని, ప్రజలకు వినోదాన్ని అందించే సాధనం సినిమా అని మంత్రి తలసాని వివరించారు. ఈ క్రమంలోనే ఏపీ సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని తలసాని చెప్పారు.
Also Read: చిరుతో రవితేజ.. టికెట్ రేట్లు పై ఏపీ మంత్రులతో మాట్లాడతాడట
సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, మూవీ ఇండస్ట్రీకి హబ్‌గా హైదరాబాద్ ఉండాలనేది తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని చెప్పారు. చిత్రసీమలో ఉన్న సమస్యలపై తెలంగాణ సర్కారు వేగంగా స్పందిస్తున్నదని, రాష్ట్ర సర్కారు బలవంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా, సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితులు ప్రస్తుతం కంటే ఇంకా ఉధృతంగా ఉంటే ఆంక్షలు తప్పవని అన్నారు. త్వరలోనే ఆన్ లైన్ టికెట్ పోర్టల్ తీసుకొస్తామని మంత్రి తలసాని వివరించారు. ఇకపోతే ఏపీలో థియేటర్ల 50 శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉండగా, తెలంగాణలో అటువంటి ఆంక్షలు అయితే ఏం లేవు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ తారలందరూ హైదరాబాద్ ఫిల్మ్ సిటీలోనే ఉంటారు. ఇకపోతే ఏపీలోని థియేటర్ల టికెట్ల ధరల తగ్గింపు విషయమై గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే సీన్ క్రియేట్ అయి ఉంది. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై అమరావతికి వెళ్లి తన వాదనను మంత్రి పేర్నినానికి వివరించారు.
Also Read: కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.. జగన్ కి అర్ధమవుతుందా ?

[…] Senior Heroine Radha: వెండితెర పై ఆ రోజుల్లో.. అనగా ఇరవై ఐదేళ్ల క్రితం.. ఆమె తన అందంతోనూ, అభినయంతోనూ అద్భుతంగా మెప్పించింది. ఒకప్పటి అగ్ర కథానాయకులైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ష, నాగార్జున, ఇలా ఆమె అందరితో ఆడిపాడింది. ఆమెను చూడడానికి ప్రేక్షకులు కూడా థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు. అది ఆమె గతం.. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. అందాల ‘రాధ’. […]