
తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది. హైదరాబాద్ లో అయితే మరీ వేడుకగా జరుగుతోంది. లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తాజాగా ఈరోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమ్మవారిలా పూనకం వచ్చిన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితుల్లో సరిగ్గా ఏడాదిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు అమ్మవారికి చెప్పగా.. దానికి స్వర్ణలత సమాధానం ఇచ్చారు.
కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను నమ్మి పూజలు చేశారని.. వర్షాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని భవిష్యవాణి తెలిపింది. నేను మీ వెంట ఉండి నడుస్తానని.. అమ్మకు ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దని స్వర్ణల చెప్పుకొచ్చారు.
‘ప్రతి ఒక్కరిని నేనే కాపాడుతా.. ప్రజలకు ఇక ఎలాంటి ఆపద రానివ్వను’ అంటూ స్వర్ణలత ప్రజలకు భవిష్యవాణి ద్వారా భరోసానిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ రంగం కార్యక్రమంలో పాల్గొన్నారు.