Swamy Goud : కేసీఆర్ తీరు నచ్చక టీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరిన స్వామిగౌడ్, శ్రవణ్ లాంటి కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారులు ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల వేళ మళ్లీ సడెన్ గా టీఆర్ఎస్ గూటికి చేరారు. ఎందుకు చేరారు? ఏంటి కథ అన్నది ఎవరికీ తెలియదు.. కానీ దీనివెనుక రహస్యాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.
తమ పార్టీలో చేరిన స్వామిగౌడ్, శ్రవణ్ లకు ప్యాకేజీలు ఇచ్చి భారీగా డబ్బు ఆశచూపి టీఆర్ఎస్ లోకి మలుచుకున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై తాజాగా స్వామిగౌడ్ క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరాక తొలిసారి ఆయన స్పందించారు. బీజేపీలో ఏడాదిపాటు ఉన్న స్వామి గౌడ్ రహస్యాలన్నీ బయటపెట్టాడు.
తాను టీఆర్ఎస్ లోకి చేరడానికి ప్యాకేజీ తీసుకున్నానన్న బండి సంజయ్ కు మరీ బీజేపీలో చేర్చుకున్నందుకు మీరు నాకు ఎంత ఇచ్చారో చెప్పాలని స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీలో చేర్చుకున్నందుకు మీరు ఎంత ఇచ్చారో చెబితే.. ఆ రహస్యాన్ని బయటపెడుతానంటూ స్వామి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఉద్యమకాలంలో సకలజనుల సమ్మె వేళ పస్తులున్న ఉద్యోగుల కోసం ఈ అంశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరితే ఇదే బీజేపీ నేతలు ఎవరూ ముందుకు రాలేదని.. టీఆర్ఎస్ తో కలిసి పోరాడామని తెలిపారు. తమకు నాడు తెలంగాణ రాష్ట్రం వద్దంటూ ప్యాకేజీ ఇవ్వాలని చూశారని..కానీ ఒప్పుకోకపోవడంతో చంపాలని చూశారని స్వామిగౌడ్ సంచలన రహస్యాలు బయటపెట్టాడు. నాడు బీజేపీలో ఉన్న రాజేశ్వరరావుకు ఈ విషయాలన్నీ తెలుసు అంటూ స్వామిగౌడ్ బాంబు పేల్చారు. నాడు ఏమైపోయారంటూ స్వామిగౌడ్ ప్రశ్నించారు.