Homeజాతీయ వార్తలునవరాత్రి ఉత్సవాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

నవరాత్రి ఉత్సవాలపై కొనసాగుతున్న ఉత్కంఠ


మరో వారంరోజుల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 2020 ఆగస్టు 22న వినాయక చవితి రాబోతుంది. ప్రతియేటా తొమ్మిదిరోజులపాటు వైభవంగా వినాయక ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి కరోనా కారణంగా గణేశ్ ఉత్సవాల నిర్వహాణపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పండుగ సమీపిస్తున్న నగరాల్లోగానీ, పల్లెల్లోగానీ ఎలాంటి సందడి లేకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

దేశంలో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా తగ్గుమఖం పట్టడం లేదు. దీంతో ఈ ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలపై పడేలా కన్పిస్తుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, బక్రీద్, బోనాల ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తాజాగా వినాయక ఉత్సవాలకు కూడా కరోనా విఘ్నం ఎదురుకానుంది. గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చానా.. తొమ్మిది రోజులపాటు కరోనా నిబంధనలు పాటించడం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు వేడుకలు ఎలా నిర్వహిస్తారనే చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా గణేష్ ఉత్సవాల ప్రారంభానికి ముందు నుంచే ఆయా పల్లెలు, నగరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. అయితే ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ప్రభుత్వం వేడుకలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మండపాల ఏర్పాటు, తదితర అనుమతులపై స్పష్టత రాకపోవడంతో ఈసారి మండపాలు ఉంటాయా? ఉంటే ఎంత ఎత్తులో ఉండే వినాయక ప్రతిమలకు అనుమతి ఇస్తారనేది తేలాల్సి ఉంది. అయితే ఈసారి భారీ విగ్రహాలు, భారీ మండపాలు, డీజే సౌండ్స్ తదితర హంగులకు అనుమతి ఉండకపోవచ్చని టాక్ విన్పిస్తోంది.

Also Read: తండ్రి రాజ్యసభలో.. తనయుడు లోక్ సభలో

నవరాత్రి ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటించే వారికి మాత్రమే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కేవలం మట్టి వినాయకుల ప్రతిమలకే అనుమతి ఉంటుందని.. ఇక బస్తీలు, గ్రామాల్లో నాలుగు అడుగులలోపు ప్రతిమలకే అనుమతి ఇవ్వాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. ఇక బస్తీకే ఒకే గణేశుడుని పరిమితం చేసే ఆలోచనలో పోలీస్ శాఖ ఉంది. మండపాల వద్ద డీజేలు, తీర్థప్రసాద వితరణ వంటివి నిషేధించనున్నారు.

పోలీస్ శాఖ అనుమతుల మేరకే మండపాల వద్ద విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జన ఊరేగింపులు ఉండేలా పోలీస్ శాఖ మానిటరింగ్ చేయనుంది. మొత్తంగా అందరీ విఘ్నాలను దూరంచేసే ఆదిదేవుడికే కరోనా విఘ్నం కలిగిస్తోంది. దేవదేవుడైనా వినాయకుడు ఇప్పటికైనా కరోనాపై కన్నెర్రచేసి మహమ్మరిని దూరం చేయాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. మరీ ఈ కరోనా విఘ్నాన్ని వినాయకుడు ఎలా దూరం చేస్తాడో వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version