Agneepath Protest: అగ్నిపథ్ అల్లర్లతో దేశం మొత్తం అట్టుడికింది. దీనికి హైదరాబాద్ నుంచే ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి రగిలిన గొడవలు చూసే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అల్లర్లు రేగినట్లు సమాచారం. దీంతో పోలీసులు కూడా వాటికి కీలక సూత్రధారుల వేటలో పడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా అందరిని ఉసిగొల్పి వారిలో ప్రతీకారం రగిలించిన నేపథ్యంలో పోలీసులు వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి దేశం యావత్తు నష్టపోవాల్సి వచ్చింది. వారు సాగించిన హంగామాతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శుక్రవారం మొత్తం జరిగిన విధ్వంసంలో భారీ మొత్తంలో నష్టాలు సంభవించినట్లు తెలుస్తోంది.

అల్లర్లు కొనసాగడానికి ప్రధాన కారకులు ఎవరనే దానిపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు ఇందులో భాగస్వాములు అయినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ద్వారా అందజేసిన సందేశాలను సేకరిస్తున్నారు. -సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన గొడవల్లో దాదాపు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరిలో 12 మంది ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు.
Also Read: Vizianagaram TDP: విజయనగరం టీడీపీలో వర్గపోరు.. అధినేత ఎదుటే బలప్రదర్శన
అగ్నిపథ్ నిర్ణయంపై వ్యతిరేకతతో విధ్వంసం జరగడానికి కారకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ
నిర్వాహకుడు వసీంపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ లలో రెచ్చగొట్టే సందేశాలు పంపించి యువతను విధ్వంసానికి ఉసిగొల్పిన విధానంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అల్లర్లు జరగడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. ఉద్యోగాలు రాలేదనే అక్కసుతోనే యువత రెచ్చిపోవడానికి కారణమైందని తెలుస్తోంది. వారిలో ఉన్న విద్వేషాన్ని రగిలించి వారిని గొడవకు ప్రేరేపించడానికి వాట్సాప్ లలో గ్రూపులు ఏర్పాటు చేసి వారిని అల్లర్లు చేసేందుకు ఉసిగొల్పారు. దీనిపై కేంద్రం సీరియస్ గా ఉంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన యువత రెచ్చిపోవడంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేయాల్సింది పోయి మన దేశ విలువలను తగ్గించే విధంగా గొడవలకు దిగడంపై పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:Fisheries Subsidies: విదేశీ ‘చేపట’ కుట్రను చేధించిన భారత్
[…] […]