BJP in Telanagana: కమల వికాసానికి రెడీ అవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ ఊపు ఉంది. కానీ ఇప్పుడు మరో రాష్ట్రానికి పాకేలా ఉంది. అదే తెలంగాణ కానుందా? అంటే సర్వేలు అవునంటున్నాయి. తెలంగాణలో బీజేపీ ఊపు చూస్తే వచ్చేసారి అధికారం దక్కడం ఖాయమంటున్నారు.
తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు టీఆర్ఎస్ అధికారం సాధించింది. ఇప్పుడు వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. జనాలు ఇటీవల ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించారు కూడా. ఈ క్రమంలోనూ హ్యాట్రిక్ కొట్టడం కేసీఆర్ కు ఈజీ కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ సమస్యలపై పోరాడుతున్న బీజేపీకి ఈ ఊపు కలిసి వస్తోంది.
తెలంగాణలో బీజేపీ మేనియా మొదలైనట్టే.. బండి సంజయ్ కుమార్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ సంస్థ చేసిన సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదన్న విశ్వాసం ఉంది.
ఈ సర్వే ప్రకారం.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు గెలుపొందుతుందని తేలింది. 2019లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే…
కాంగ్రెస్ గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుపొందగా.. తాజాగా ఎన్నికలు జరిగితే రెండు స్థానాలకే పరిమితం..
టీ.ఆర్.ఎస్ + మజ్లిస్ కూటమి గత ఎన్నికల్లో 10 సీట్లలో గెలుపొందగా… ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒక స్థానం కోల్పోనుంది.
ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం.. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కి ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల వరకూ ఇది మరింతగా పెరిగి బీజేపీ అధికారంలోకి రాగలదన్న విశ్వాసం ఉంది.