Jagan- Amaravati: ” రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు . ఇప్పటికే ప్రజాధనం భారీగా ఖర్చు చేశారు.. రాజ్యాంగం, నైతికత, విశ్వాసం కచ్చితంగా పాటించాలి. ఇవి ఉంటే రాజధానిపై వెనక్కి వెళ్ళకూడదు” ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ ఇది ఇలా ఉంటే సాక్షి, టీవీ 9, ఎన్టీ టీవీ మాత్రం తమ యజమానులకు ఇష్టమైన పార్టీలకు చెందిన లాయర్లు చేసిన వాదనలు చూపించాయి. ఏపీ జనాలను తప్పు దోవ పట్టించాయి. అమరావతి విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అని ఎదురుచూసిన వాళ్ళకి ఆ మూడు చానళ్ళు తమకు నచ్చిన తీర్పును నిజం అనిపించేలా చూపించడం దురదృష్టకరం

ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జగన్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బే తగిలింది.. వాస్తవంగా కూడా ఇది ఎవరికైనా అర్థమవుతుంది. కానీ జగన్ డప్పు కొడుతున్న ఆ మూడు చానళ్ళకు సహజంగానే సుప్రీంకోర్టు తీర్పు నచ్చలేదు. దీంతో తమకు నచ్చిన అంశాల ఆధారంగా జనాలను తప్పుదారి పట్టించాయి.. జర్నలిజం నిబంధనల ప్రకారం న్యాయవ్యవస్థ, తీర్పుల గురించి రాసేటప్పుడు మీడియా కొంత జాగ్రత్త పడుతుంది. సమయమనం పాటిస్తుంది. కానీ రాజకీయరంగు పులుముకున్న కొన్ని మీడియా సంస్థలు మాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాయి.. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో ఎటువంటి సంబంధం లేకుండా, తమకు అనుకూలమైన న్యాయవాది కోర్టులో ఏ వాదనలు వినిపిస్తే వాటిని గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. కానీ తీర్పు గురించి మాత్రం సరిగా చెప్పడం లేదు. అమరావతి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా జరిగింది ఇదే.
జస్టిస్ నాగరత్న కు ప్రాధాన్యత
అమరావతి పై విచారణ సమయంలో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన మీడియా… తీర్పులోని అంశాలపై ఏమాత్రం కిక్కుమనలేదు. వాస్తవాలను ప్రజలకు చెప్పలేదు.. సుప్రీంకోర్టు నిర్ణయంతో మూడు రాజధానులపై ముందుకు వెళ్లలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండగా.. హైకోర్టు విధించిన గడువులపైనే సుప్రీంకోర్టు స్టే విధించింది.. ఆ స్టే ఇవ్వక పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ఒక వేళ ఇచ్చినా, ఇవ్వక పోయినా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు.
కదిలించలేరు
సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని విషయాలు పరిశీలిస్తే… రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్లో అంగుళం కూడా దుర్వినియోగం చేయలేరు. రాజధానిని అడుగు కూడా కదిలించలేరు. పేదలకు పంచాలని అసెంబ్లీలో చేసిన తీర్మానం పనికిరాదని సుప్రీంకోర్టు చెత్త బుట్టలో వేసింది.. ఈ విషయాలు ఆ మూడు మీడియా సంస్థలు చెప్పలేదు.. మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు మూడు రాజధానులపై ముందుకు వెళ్లలేరు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విచారణ ఎంతకాలం జరుగుతుందో అంచనా వేయడం కష్టం.. సాధ్యాధ్యాలను పరిశీలిస్తే ఏం జరుగుతుందో అనే దానిపై న్యాయ నిపుణులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.. మీడియా అనేది బహుళంగా ఉన్న ఈ రోజుల్లో… ఈ మూడు మీడియా సంస్థలు అరకొర సమాచారం ఇవ్వడం వల్ల వాస్తవాన్ని ప్రజలకు చేరనీయకుండా చేసినట్టు అవుతున్నది. ఒక మీడియా సంస్థ ప్రచురించిన వార్తలనే ప్రజలు చదవడం లేదు. వాళ్లు అనేక విధాలుగా సమాచారం తెలుసుకుంటున్నారు.

తీర్పులు మారిపోతాయా
యజమానులకు కాంట్రాక్టులు లేదా పదవులు వస్తాయేమో గాని.. సుప్రీంకోర్టు తీర్పులు మాత్రం మారిపోవు.. బాధ్యతాయుతమైన మీడియాగా వ్యవహరించాల్సిన ఆ సంస్థలు నీతి తప్పి వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు వాస్తవాలు తెలియడం లేదు. వాస్తవానికి మీడియా అనేది ప్రజల వైపు ఉండాలి. దురదృష్టవశాత్తు ఆ మూడు ఛానళ్లు ప్రభుత్వం వైపు ఉన్నాయి.. దీనికి తోడు ప్రజలపై ఒక రకమైన ముద్ర వేసి సమాజానికి చూపిస్తున్నాయి.. దీనివల్ల మీడియా అంటేనే ఏవగింపు కలుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆ మూడు ఛానళ్లు అంటేనే ఆంధ్ర ప్రజలు ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. అమరావతిపై సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ మూడు ఛానళ్లు తల ఎక్కడ పెట్టుకుంటాయో చూడాలి. ఈ కేసు విచారణ జనవరి 31 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు… ఆరోజు జగన్ ప్రభుత్వానికి అసలు సినిమా చూపించడం ఖాయం.. ఇప్పటికే ఎన్నోసార్లు కోర్టు చేతిలో మొట్టికాయలు తిన్న జగన్… జనవరి 31 తేదీన వచ్చే తీర్పుతో నైనా మారతారా? లేక ఎప్పట్లాగానే నవ్వులు చిందిస్తారా? వేచి చూడాల్సిందే.