CBI probe on AP Minister: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సురేష్ దంపతుల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా సీబీఐ కేసు నమదు చేయడంపై ఆదిమూలపు సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సురేష్ దంపతుల వాదనతో ఏకీభవించింది. హైకోర్టు సీబీఐ అభియోగాలను తోసిపుచ్చింది.

హైకోర్టు తీర్పుపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పును కొట్టేసింది. సురేష్ దంపతుల కేసుపై విచారణ కొనసాగించాలని సూచించింది. వారు ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన నేపథ్యంలో ఆయన భార్య విజయలక్ష్మిపై 2016లో కేసు నమోదైంది. ఆమె ఇంకా సర్వీసులోనే ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాన్న ఫిర్యాదుతో 2017లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ నేపథ్యంలో కేసు విచారణ నిలిపివేయాలని సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. చివరకు సీబీఐ పట్టు సాధించింది. ఈ కేసులో గత నెల 22న విచారణ పూర్తి చేసి తీర్పును శుక్రవారం వెలువరించింది.
ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్ దంపతులపై విచారణ కొనసాగనుంది. ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నారనే విషయంలో వారిపై కేసులు ఉన్నందున సీబీఐ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. దీనిపై వారు చేసుకున్న అభ్యర్థనలను సుప్రీం తోసిపుచ్చింది. కేసులో పురోగతి సాధించాలని సూచించింది.