Homeజాతీయ వార్తలుSupreme court: కోల్ కతా హై కోర్టు మొట్టికాయలు మర్చిపోకముందే.. సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.....

Supreme court: కోల్ కతా హై కోర్టు మొట్టికాయలు మర్చిపోకముందే.. సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.. మమత సర్కార్ కు ఏంటి ఈ ఎదురుదెబ్బలు?

Supreme court:  దేశవ్యాప్తంగా కోల్ కతా వైద్య విద్యార్థిని హత్యాచార కేసు ప్రకంపనలకు కారణమవుతోంది. అయితే ఈ కేసులో ఆదివారం సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఏకంగా సుమోటోగా స్వీకరించి. ఇప్పటికే ఈ కేసు విషయంలో కోల్ కతా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మొట్టికాయలు వేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే సిబిఐ ఈ కేసు పరిధిలోకి ప్రవేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆగస్టు 20 అంటే మంగళవారం ఈ కేసును విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది.

కోల్ కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్య విద్యార్థిని పై హత్యాచారం జరిగినప్పుడు.. ఈ ఘటనను మసిపూసి మారేడు కాయ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ఇలా ఎందుకు స్పందిస్తున్నారు అంటూ మండిపడింది. వెంటనే ఈ కేసును సిబిఐ కి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. మూడు వారాల్లో విచారణ పూర్తి చేసి, తుది నివేదిక ఇవ్వాలని సిబిఐ ని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది.

కోల్ కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిబిఐ చేస్తుండగా.. ఘటన జరిగిన ఆసుపత్రి ప్రాంగణంలోని సెమినార్ హాల్లో ఆధారాలు చెరిపి వేసేందుకు కొంతమంది దుండగులు ప్రయత్నించారు. ఆ ఆస్పత్రి లో దాడులకు తెగబడ్డారు . 40 మంది ఈ ఈ దాడుల్లో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై కూడా సిబిఐ విచారణ జరుపుతోంది. ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగడంతో మమత సర్కార్ కు గట్టి షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ కేసు ను దర్యాప్తు చేస్తున్న తీరును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా మమత ప్రభుత్వ వ్యవహార శైలిపై దుమ్మెత్తి పోస్తున్నారు. విచారణ సరిగా జరగడంలేదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొంటున్నారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు మమత
ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో ఏదైనా జరగవచ్చుననే సంకేతాలు ఇస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular