AP Three Capitals Issue: ఎటువంటి ఉద్యమమైనా ప్రజల అభిమానం, ప్రజాభిష్టం ఉంటేనే సక్సెస్ అయ్యేది. కృత్రిమ ఉద్యమాలు తాత్కాలికమే తప్ప.. వాటికి శాశ్వతత్వం ఉండదు. కచ్చితత్వం అసలు కనిపించదు. ఇప్పుడు మూడు రాజధానులు కూడా అటువంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది. ప్రస్తుతం అమరావతికి మద్దతుగా రైతుల పాదయాత్ర ఉద్యమంలా సాగుతోంది. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. దీంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. అందుకే మూడు రాజధానులకు మద్దతుగా కార్యక్రమాలను స్పీడప్ చేస్తోంది. మేధావుల చర్చాగోష్టిలను కూలి మీడియా హైప్ చేస్తున్నా ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. లైవ్ టెలీకాస్టు చేస్తున్నా…అంతా తేనేటి విందులాగా సాగుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం అధిష్టానం నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే అమరావతి రైతులను ఆడి పోసుకుంటున్నారు. మేము తలచుకుంటే అమరావతి రైతుల పాదయాత్రను ఒక్క నిమిషంలో అడ్డుకోగలమని కవ్వింపు హెచ్చరికలు పంపుతున్నారు. అయితే అమరావతి రైతులు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

వాస్తవానికి అమరావతి ఉద్యమాన్ని వైసీపీ నేతలు చాలా లైట్ తీసుకున్నారు. ఇంతలా రెస్పాన్స్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్,వామపక్షాలు, బీజేపీ.. ఒక్కవైసీపీ మినహాయించి అన్నిరాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, లాయర్లు..ఇలా అన్ని సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి. గతంలో అమరావతికి ఎస్ చెప్పి.. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన జగన్ వైఖరిపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ మాట మార్చి అమరావతి రైతులకు మోసం చేశారన్న అభిప్రాయానికి వచ్చారు.
Also Read: KCR National Party- AP: సే సోరీ టూ ఏపీ… అప్పుడే కేసీఆర్ ని ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేసేది
పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి వైసీపీ నేతలు, మంత్రులు యాత్రపై చేస్తున్న కామెంట్స్ ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణాలవుతున్నాయి.

అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చినా ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే విభజిత ఏపీలో వారు రాయలసీమ, మేము కోస్తా, వారు ఉత్తరాంధ్ర అన్న భావన ప్రజల్లో లేదు. ఇప్పటికే తెలుగువారిగా ఉంటూ తెలంగాణ వేర్పాటు వాదాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అటువంటిది ఇప్పుడు కొత్తగా చిచ్చు పెట్టాలని చూసిన వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. టీడీపీ సర్కారు అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో ప్రజలు ఆహ్వానించారు. అటు జగన్ సర్కారు మూడు రాజధానులను తెరపైకి తెచ్చినా ప్రజలు ఆహ్వానించలేదు. కానీ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి మేధావులతో రౌంట్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నా పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ మూడు రాజధానులను ఎత్తుకుందన్న వాదన మెజార్టీ ప్రజల్లో ఉంది. అది వచ్చే ఎన్నికల్లో ప్రస్పుటమయ్యే అవకాశమైతే కనిపిస్తోంది.
Also Read: Gambia Tragedy: గాంబియా విషాదం: ఫార్మా కంపెనీలూ… భారత్ కి చెడ్డ పేరు తేవొద్దు!
[…] Also Read: AP Three Capitals Issue: ప్రజల్లో తేలిపోతున్న మూడు ర… […]
[…] Also Read: AP Three Capitals Issue: ప్రజల్లో తేలిపోతున్న మూడు ర… […]