KCR National Party- AP: కేసీఆర్ కు ఇది సంక్లిష్ట పరిస్థితి. ఇప్పటివరకూ ఆయన ఒక ప్రాంతీయ వాది. ఇప్పుడు జాతీయ వాదిగా మారారు. ఇది సంతోషకరమైన విషయమే. కానీ ఆయన ఇప్పటివరకూ చేసిన రాజకీయాల నుంచి మాత్రం తప్పించుకునేందుకు వీలులేదు. వాటి ఫలితాలను, పర్యవసానాలను ఫేస్ చెయ్యాల్సిందే. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మాత్రం ఆయన ఆది నుంచి ఆంధ్రులపై ధ్వేషంతోనే కొనసాగింది. కేవలం చంద్రబాబుతో రాజకీయంగా విభేదించి మాత్రమే కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించారు. కానీ తెలంగాణ ప్రజల కోసమేనని భావించారు. తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు ఏపీ ప్రజలను తూలనాడుతూ వచ్చారు. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఏపీ ప్రజలనే బూచీగా చూపించారు. తనను కాందటే ఏపీ పాలనలోకి తెలంగాణ వెళుతుందని హెచ్చరించేవారు. తెలంగాణ ప్రజలను భయపెడుతూనే అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీ అంటూ దేశాన్న ఉద్ధరించేందుకు బయలుదేరారు.

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ పతాక స్థాయిలో తీసుకువెళ్లడం వెనుక ఇచ్చిన స్లోగన్ ‘ఆంధ్రులు దొంగోళ్లు’. ఉద్యమ సమయంలో ఆయన నోటీ నుంచి వచ్చిన ప్రతీమాట ఏపీ ప్రజలను తూలనాడడమే. ఆంధ్రులను బూచీగా చూపి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నీళ్లు, విధులు, నియామకాలు వంటి మూడింటి విషయంలో ఆంధ్రోళ్లు దోపిడీ చేశారని కేసీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థాయి మరిచి.. హోదా దిగజారి విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.
Also Read: Impact Of BRS In AP: కేసీఆర్ బీఆర్ఎస్.. ఏపీ, జగన్ పై ప్రభావమెంత?
చివరకు బూతులు సైతం తిట్టారు. అయితే ఇప్పుడు అవే కేసీఆర్ కు ప్రతిబంధకాలుగా మారాయి. నాటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు,గుళ్లు, గోపురాలకు వస్తే ఆత్మీయంగా సత్కరిస్తామని.. రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని మాత్రం హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిణామాల క్రమంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు శిరసు వంచి క్షమాపణలు చెప్పినా కొంతవరకూ ఆలోచించే అవకాశమైతే ఉంది.

అటు రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీ చాలావరకూ ఆదాయ వనరులను కోల్పోయింది. విభజనతో సుసంపన్న హైదరాబాద్ కే పరిమితమైంది. దాదాపు ఉమ్మడి ఆస్తులన్నీ తెలంగాణకే ఉండిపోయాయి. ఏపీని కట్టుబట్టలతో మిగిల్చారన్న ఆవేదన ఇక్కడి ప్రజల్లో ఉంది. అటు విభజనతో న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలు కూడా ఏపీకి రావడం లేదు. ఏపీ పాలకులను బ్లాక్ మెయిల్ చేసి మరీ లక్ష కోట్ల వరకూ తన వద్ద ఉంచుకుందన్న ఆరోపణలున్నాయి. అటు నీరు నుంచి కరెంట్ వరకూ బకాయిలను సైతం ఏపీకి చెల్లించలేదు. అటు నదీ జలాల వివాదాన్ని కొలిక్కి తేలేదు. ఇవన్నీ మరిచి.. కుల రాజకీయాలతో కేసీఆర్ ఏపీలో ప్రవేశించాలని చూస్తే మాత్రం ఇక్కడి ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశాలైతే మాత్రం లేదు.
Also Read:Gambia Tragedy: గాంబియా విషాదం: ఫార్మా కంపెనీలూ… భారత్ కి చెడ్డ పేరు తేవొద్దు!
[…] […]
[…] […]