జగన్ కేబినెట్లో సూపర్ మినిస్టర్స్ వీళ్లే..

పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావడమే కాదు… దానిని సక్రమంగా నడిపించే సత్తా కూడా ఉండాలి.. ఓ వైపు ప్రజలను చేరదిస్తూ మరో వైపు పార్టీని కాపాడుకుంటూ పోవాలి. ఎంత చేసినా ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పవు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలు కూడా ప్రభుత్వాన్ని పడగొట్టే సందర్భం రావచ్చు. అయితే ఆ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే నాయకులను పార్టీలో తయారు చేయాలి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అలాంటి నాయకులను ముందే ఉంచింది. […]

Written By: NARESH, Updated On : May 11, 2021 10:28 am
Follow us on

పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావడమే కాదు… దానిని సక్రమంగా నడిపించే సత్తా కూడా ఉండాలి.. ఓ వైపు ప్రజలను చేరదిస్తూ మరో వైపు పార్టీని కాపాడుకుంటూ పోవాలి. ఎంత చేసినా ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పవు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ విమర్శలు కూడా ప్రభుత్వాన్ని పడగొట్టే సందర్భం రావచ్చు. అయితే ఆ విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే నాయకులను పార్టీలో తయారు చేయాలి. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అలాంటి నాయకులను ముందే ఉంచింది. ముఖ్యంగా ప్రతిపక్షంగా ప్రధానంగా ఉన్న చంద్రబాబు, పవన్ ల నుంచి వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చేప్పేందుకు జగన్ ఇద్దరు మంత్రులను ముందుంచాడట. వారు జగన్ పై ఈగ వాలనీయకుండా సమాధానాలు చెబుతున్నారట.

కృష్ణ జిల్లాకు చెందిన కొడాలి నాని గురించి అందరికీ తెలుసు. ఆయన నోరు విప్పితే ముందుగా చంద్రబాబు పైనే విరుచుకుపడుతాడు. జగన్ గురించి ఒక్క మాట అన్నా వెంటనే చంద్రబాబును మాటల బాణాలు ఎక్కు పెట్టేస్తాడు. అంతకుముందు టీడీపీకి వీరాభిమానిగా ఉన్నా చంద్రబాబు అంటే మాత్రం కొడాలి నానిక అస్సలు పడదు. అంతేకాకుండా తనకు జగన్ అంటే చాలా ఇష్టమని ఎప్పటి నుంచో అనడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ ఫుల్ స్వేచ్ఛను ఇచ్చేశాడు. అంతేకాకుండా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో అటు వైపు నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అందుకే కొడాలి నాని జగన్ కు ఫుల్ సపోర్టు అని చొప్పొచ్చు.

ఇక మరో మంత్రి పేర్ని నాని. ఈయన పవన్ పై ఎప్పుడూ గురి పెడుతుంటారు. ఇటీవల పవన్ సినిమా విడుదల సమయంలో పేర్ని నాని ముందుండి బెనిఫిట్ షోల ను రద్దు చేయించాడు. ఆ సమయంలో వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు. పవన్ కు మద్దతుగా బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా వాటిని జగన్ వద్దకు పోనీయకుండా పేర్ని నాని ఇక్కడే తెగ్గొట్టేశాడు. ఈయన కూడా పవన్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కాబట్టి సామాజికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని జగన్ ఆ రకంగా స్వేచ్ఛనిచ్చాడట.

ఇలా జగన్ కేబినేట్ లో సూపర్ మినిస్టర్స్ గా ఉన్న నానిలు కౌంటర్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు. ఒకప్పుడు చంద్రబాబు ఏ సామాజిక వర్గ నేతకు ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పెట్టి తిట్టించేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నాడని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ నానిలు జగన్ కు కీలక మంత్రులుగా కొనసాగుతున్నారు.