Homeఆంధ్రప్రదేశ్‌Vishakapatnam: ఆదివారం ఉదయం... సాగర తీరంలో ఉలిక్కిపడుతున్న విపక్షం

Vishakapatnam: ఆదివారం ఉదయం… సాగర తీరంలో ఉలిక్కిపడుతున్న విపక్షం

Vishakapatnam: ఆదివారం వచ్చిందంటే చాలూ విశాఖలో టీడీపీ నాయకులు వణికిపోతున్నారు. ప్రభుత్వం ఏ విధ్వంసానికి దిగుతుందోనని భయపడిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనో.. పార్టీలో చేరలేదన్న అక్కసుతోనే విశాఖలో విపక్ష నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. దివంగత నాయకుడు సబ్బం హరి నుంచి నేటి అయ్యన్నపాత్రుడి ఇళ్ల విధ్వంసం వరకూ ఎపిసోడ్లు చూసుకుంటే ఆదివారం ఉదయం కుట్రే ఎక్కువగా కనిపిస్తోంది. తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు, జేసీబీలను పంపి నిర్మాణాలను కూలగోడుతోంది. తొలుత సీనియర్‌ నాయకుడైన సబ్బం హరిని టార్గెట్ చేసుకుంది. అధికార పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని ఆయనపై కక్ష గట్టింది. విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవనంలో జీవీఎంసీ పార్కుకు చెందిన ఆరు అడుగుల వెడల్పు మేర స్థలం కలిసిపోయిందంటూ, అందులో ఉన్న వాచ్‌మన్‌ బాత్‌రూమ్‌ను కూలగొట్టించింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసినబాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు చెందిన గీతం విశ్వవిద్యాలయంపై పడింది. అందులో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్రధాన ప్రవేశద్వారం కూలగొట్టించింది. కొన్ని ఎకరాల భూమిని మార్కింగ్‌ చేసి, అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడైన హర్షవర్ధన్‌ సిరిపురంలో వీఎంఆర్‌డీఏకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకొని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ పేరుతో హోటల్‌ నడుపుతుండగా దీపావళి రోజున బలవంతంగా ఖాళీ చేయించింది. హోటల్‌లో వంట పాత్రలతో సహా ఫర్నీచర్‌ను పది లారీల్లోకి ఎక్కించి, దానికి తాళాలు వేయించింది. నోటీసు కూడా ఇవ్వకుండా ఇదేమి అన్యాయమని ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశం మేరకు ఏడాదిన్నర తరువాత మళ్లీ ఆయనకు అప్పగించారు.

Vishakapatnam
Fusion Foods Closed

పార్టీలో చేరలేదని..

విశాఖ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ చూపించారు. తాను పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో కక్ష గట్టి గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని జీవీఎంసీ సిబ్బందితో కూలగొట్టించారు. దానిపై ఆయన కోర్టుకు వెళ్లారు. అక్కడితో ఆగకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఆయన భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ వాటిలో నిర్మాణాలను కూలగొట్టారు. ఆ భూములు పల్లా శ్రీనివాసరావుకు చెందినవి కావని, తమవని అక్కడి వారు చెబుతున్నా వినిపించుకోలేదు. దాంతో సదరు బాధితులు కోర్టుకు వెళ్లారు.

భయపడి చేరిన వారు..

Vishakapatnam
Ganta Srinivas Rao

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా పేరొందిన బొడ్డేటి కాశీ విశ్వనాథం భీమిలి సమీపాన కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని అందులో గోకార్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అందులో ప్రభుత్వ భూమి ఉందని ఆరోపిస్తూ దానిని కూడా ఓ ఆదివారం తెల్లవారుజామున చిన్నాభిన్నం చేశారు. దాంతో ఆయన భయపడి తన వ్యాపార అవసరాల కోసం వైసీపీ కండువా కప్పుకొన్నారు. అదేవిధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద డాబాగార్డెన్స్‌లో వాణిజ్య సముదాయం నిర్మిస్తుండగా, ప్లాన్‌ ప్రకారం లేదని ఆరోపిస్తూ దానిని కూడా ఆదివారం రోజునే కూలగొట్టారు.

అయ్యన్న ఇంటిపై దాడి

Vishakapatnam
Ayyanna Patrudu House

ఇటీవల తెలుగుదేశం పార్టీ చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడు విజయవంతం కావడం, ఆ సభలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులను అయ్యన్నపాత్రుడు విమర్శించడంతో ఆయనపై కక్ష గట్టారు. రెండు సెంట్ల స్థలం ఆక్రమించారంటూ చాలా ఏళ్ల క్రితం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శివపురంలో నిర్మించుకున్న ఇంటి ప్రహరీని ఆదివారం తెల్లవారుజామున కూలగొట్టారు. తమ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసి, మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ ఇలా వ్యవహరిస్తోందని, దీనిని ఎదుర్కొని తీరతామని అయ్యన్న కుటుంబీకులు ప్రకటించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా చేస్తున్నారని విమర్శించారు.

Also Read: Samantha Divorce Reason: కాఫీ విత్ కరణ్ షోలో సమంత బరస్ట్… విడాకుల ఎందుకో చెప్పి చైతూకు షాక్!

ఆ శాఖలదే కీలక పాత్ర

టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ పెద్దలు.. అందుకు రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖలను విస్తృతంగా వాడుకుంటున్నారు. భూమి అయితే రెవెన్యూ అధికారులను, భవనం అయితే మున్సిపల్‌ సిబ్బందిని ముందుంచి కథ నడుపుతున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా శనివారం రాత్రి ప్లాన్‌ చేసుకొని, ఆదివారం తెల్లవారుజామున వందల సంఖ్యలో పోలీసులను తీసుకువెళ్లి వారు అనుకున్న పని పూర్తి చేస్తున్నారు.

Also Read: Viral: చెల్లి పెళ్లికి చనిపోయిన తండ్రిని ఆ అన్నయ్య ఇలా తీసుకొచ్చాడట?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular