Tirumala Rush: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. వడ్డీకాసులవాడు. కోరిన కోర్కెలు తీర్చే దైవం. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే లక్ష మంది బక్తులు విచ్చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు వారికి సదుపాయాలు కల్పించడానికి నానా తంటాలు పడ్డారు. గతంలో ఇలాగే భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. దీంతో ప్రస్తుతం కూడా అలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బక్తులకు జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో భక్తులు తరలి రావడం చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత మంది వస్తారో కూడా తెలియడం లేదు.

తిరుమల రోడ్లన్ని జనమయం అయ్యాయి. కంపార్ట్ మెంట్లన్ని నిండిపోయాయి. దీంతో దేవుడి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలకు స్వస్తి పలికి భక్తులను త్వరగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తజన సంద్రంతో తిరుమల కిటకిటలాడుతోంది. భక్తులకు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు హైరానా పడుతున్నారు.
Also Read: Husband And Wife Relation: భార్యాభర్తల బంధం బలంగా కొనసాగాలంటే ఏం చేయాలి?
ఈ నేథ్యంలో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంకా భక్తజనం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో భక్తుల రాకను గమనిస్తున్న అధికారులు వారిని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచించాల్సి వస్తోంది. తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు రావడం గమనార్హం. భక్తుల రాకను అధికారులు ఊహించకపోవడంతో ఒక్కసారిగా రావడంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కంగారులో తలలు పట్టుకుంటున్నారు.

సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు అధికసంఖ్యలో రావడం తెలిసిందే కానీ ఇప్పుడు పరీక్షలు ముగిసినందున అందరు దేవుడి దర్శనానికి బారులు తీరారు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తజన సందోహం నేపథ్యంలో భక్తులు కొద్ది రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కిటకిట దృష్ట్యా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read:
Cheapest Ice-Cream: హాట్ సమ్మర్‌లో కూల్ ఆఫర్… అక్కడ రూ.2కే కోన్ ఐస్‌క్రీం!!