కక్షసాధింపు వదిలి కరోనా సంగతి చూడు జగన్

నేడు దేశం అంతా కరోనా ఉపద్రవం ఎదుర్కొంటున్న సమయంలో కక్షసాధింపు రాజకీయాలను వదిలి కరోనా కట్టడి సంగతి చూడమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హితవు చెప్పారు. కరోనా గురించి ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని అంటూ పొరుగున ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసైనా తెలుసుకోమని సుజనా సూచించారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రాగద్వేషాలు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. కరోనా […]

Written By: Neelambaram, Updated On : April 19, 2020 3:41 pm
Follow us on


నేడు దేశం అంతా కరోనా ఉపద్రవం ఎదుర్కొంటున్న సమయంలో కక్షసాధింపు రాజకీయాలను వదిలి కరోనా కట్టడి సంగతి చూడమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హితవు చెప్పారు.

కరోనా గురించి ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని అంటూ పొరుగున ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసైనా తెలుసుకోమని సుజనా సూచించారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రాగద్వేషాలు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు.

కరోనా నివారణకై కేంద్ర మార్గదర్శకాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తుతూ, నడవడిని మార్చుకోమని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉండగలవాని హెచ్చరించారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందింతే పరిస్థితి భయంకరంగా ఉంటుందని చెబుతూ, ఈ ప్రమాదం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇలాంటి సమయంలో వైసీపీ రాజ కీయాలు చేయడం దురదృష్టకరం అని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో పాలనలో విఫలమైతే ప్రజలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖకు మెడ్‌టెక్ జోన్‌ను తీసుకురావడం చాలా మంచి పరిణామం అని చెబుతూ ఇక్కడే కిట్లను తయారు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కొరియా నుంచి టెస్ట్ కిట్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని సుజనా ఎద్దేవా చేశారు. టెస్టు కిట్ల ద్వారా వచ్చిన లాభాలేంటో చెప్పాలని నిలదీశారు.

పరిస్థితి తీవ్రతను పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరితో సంప్రదించి, సలహాలు, సూచనలు తీసుకోవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.