Homeజాతీయ వార్తలుMegha Krishna Reddy Wife: అసలే ఆమె మెఘా కృష్ణారెడ్డి భార్య.. 142 కోట్లు...

Megha Krishna Reddy Wife: అసలే ఆమె మెఘా కృష్ణారెడ్డి భార్య.. 142 కోట్లు ఒక లెక్కా..

Megha Krishna Reddy Wife: డబ్బున్న వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ సేవలోనే ప్రభుత్వాలు తరిస్తూ ఉంటాయి. ఇక మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రీమంతులు అడుగు బయట పెడితే చాలు అదేదో ఘనకార్యం అన్నట్టుగా.. అది సృష్టికి అద్భుతం అన్నట్టుగా మీడియా రాస్తూ ఉంటుంది. వాళ్ల సంబంధించిన అన్ని పనులను కూడా ప్రభుత్వాలు దగ్గరుండి మరి చేసి పెడతాయి. ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రుల వరకు అందరు సాగిల పడుతూనే ఉంటారు. ఉదాహరణకు ముకేశ్ అంబానీ ఏదైనా ఆలయానికి వస్తే అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. పీఎం లెవెల్ లో ఆయనకు సెక్యూరిటీ లభిస్తుంది. ఏదైనా రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రిని ముఖేష్ అంబానీ కలిస్తే అదేదో మహాభాగ్యం అన్నట్టుగా అక్కడి ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. ముకేశ్ అంబానీ పెట్టుబడి పెడితే.. ఆయన మొత్తం ఉదారంగా సేవలు చేస్తున్నారంటూ అక్కడి ప్రభుత్వం కొనియాడుతూ ఉంటుంది.. ముకేశ్ అంబానీ కేవలం ఉదాహరణ మాత్రమే..

ఆ మధ్య టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు చిన్న వార్త లీక్ అయింది. అంతే మస్క్ ను ట్యాగ్ చేస్తూ అనేక మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటూ రిక్వెస్ట్ చేశారు. చివరికి మస్క్ తూచ్ అంటూ తన ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు. డబ్బున్న వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఏ విధంగా సాగిలపడతాయో ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. కాంట్రాక్టర్లు.. ఇతర వ్యవహారాలు సాగించేవారు కూడా తక్కువేమీ కాదు.

తెలుగు రాష్ట్రాలలో మెఘా కంపెనీ చేపట్టని ప్రాజెక్టు అంటూ లేదు. ఆ కంపెనీ కి పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి యజమానులుగా ఉన్నారు. కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆమె ప్రతి సందర్భంలోనూ ట్రెండీగా కనిపిస్తుంటారు. తాజాగా మెట్ గాలా 2026 లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ధర ఏకంగా 142 కోట్లు అంట. ఆమె ధరించిన కాస్ట్యూమ్ కు పోటీగా ఆ నెక్లెస్ నిలిచింది. చుట్టు గులాబీ రంగు లో ఉన్న వజ్రాలతో అలిన ఈ ఆభరణానికి మధ్యలో వంకాయ రంగులు 550 క్యారెట్ల అరుదైన టాంజానియా మేరెలాని డైమండ్ ఉంది. ఈ వజ్రాన్ని క్వీన్ ఆఫ్ మేరేలాని అని పిలుస్తారు.. సుధా రెడ్డి ధరించిన ఈ ఆభరణం ఖరీదు 142 కోట్లు ఉండడంతో.. నేషనల్ మీడియా.. లోకల్ మీడియా ప్రధానంగా ఫోకస్ చేసింది. సుధా రెడ్డికి విపరీతమైన కవరేజీ ఇచ్చింది. సుధా రెడ్డి 142 కోట్ల నక్లెస్ ధరించడం వల్ల ఎవరికి లాభం.. మీడియా ఆ వార్తను ప్రచురించడం వల్ల ఎవరికి ఉపయోగం.. అనే ప్రశ్నలు మీలో వ్యక్తం కావచ్చు. దీనిని బట్టి మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version