GHMC: నగర జీవితం నరకప్రాయంగా మారుతోంది. ఓ పక్క కాలుష్యం మరోవైపు విపరీతమైన జనాభా సామాన్యుడికి నరకంగానే కనిపిస్తోంది. నరగంలో రోడ్ల దుస్థితి గురించి చెప్పనవసరం లేదు. ఇక వాహనాల శబ్ధంతో మన చెవులు చిల్లులు పడాల్సిందే. అంతలా వాహన కాలుష్యం పెరుగుతోంది. దారులన్నీ జనంతో నిండిపోయి ఉంటాయి. నగరంలో వాహనాల వేగం చెప్పనవసరం లేదు. సందు దొరికిందా ఇక వాహనాల వేగం చెప్పాల్సిన పని లేదు. ఎటు చూసినా వాహనాల వేగంతో మనకు భయమే కలుగుతుంది.

ఈ నేపథ్యంలో వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. అధిక వేగంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రజల్లో అవగాహన లేమితో నిత్యం ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో పోలీస్, రవాణా శాఖ అధికారులు స్పందిస్తున్నారు. వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. అధిక వేగం ప్రాణాంతకమని చెబుతున్నారు. దీన్ని అదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలను కంట్రోల్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రమాదాల నివారణ నిమిత్తం పలు కోణాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కాలనీల్లోని రోడ్లపై 30 కిలోమీటర్ల వేగం కన్నా పెరగొద్దని చెబుతున్నారు. అలాగే డివైడర్లు ఉన్న రోడ్లపై 60 కిలోమీటర్లు మించొద్దని, డివైడర్లు వేని ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా వెళ్లొద్దని బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించే క్రమంలో అధికారులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వేగం కన్నా ప్రాణం మిన్న అనే నినాదం తెలిసినా ఎవరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఎంతో నష్టం కలుగుతుంది. వేగాన్ని నియంత్రించుకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు. దీంతో అధికార యంత్రాంగం వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నా ప్రజలు అనుసరిస్తారా? లేదా అనేది సందేహమే. ఎందుకంటే మన వారికి మంచి కంటే చెడు మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మంచి చెబితే పట్టించుకోరు. చెడుకైతే తొందరగా స్పందిస్తారు. అధికారులు తీసుకున్న చర్యలు ఫలిస్తాయో లేదో తెలియడం లేదు.