Undavalli Arun Kumar: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో రెండు వర్గాలుగా మారిపోయి తాము అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. ఏపీలో కొనసాగుతున్న అనిశ్చితికి పరిష్కార మార్గం చూపేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నడుం బిగించారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ రెండు వర్గాల్లో సమన్వయం సాధించేందుకు చొరవ చూపుతున్నారు. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వంపై పోరాడాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేయాలని ఉద్యోగులు చూస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో రాష్ర్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బేషజాలకు పోకుండా సమన్వయంతో ఆలోచించాలని ఉండవల్లి హితవు పలుకుతున్నారు. దీంతో ఉండవల్లి మధ్యవర్తిత్వం ఫలిస్తుందా లేక ఇంకా గొడవ ముదురుతుందా అని అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొస్తారా?
వేతనాల విషయంలో మొదలైన సమ్మె ప్రస్తుతం తారాస్థాయికి చేరుతోంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ ఉండవల్లి విశ్లేషణలు బాగానే చేయగలరు. కానీ ఉద్యోగులను మెప్పిస్తారా? లేక వారి బారి నుంచి తప్పించుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఉద్యోగులు ఉండవల్లిని గుర్తిస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఏదేమైనా రాష్ర్ట భవిష్యత్ దృష్ట్యా ఉండవల్లి లాంటి వారు మధ్యవర్తిత్వం వహించడం ఆహ్వానించదగినదే. కానీ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడే ఆయనకు గుర్తింపు ఉంటుంది. ఆయన చేసిన పనికి ఓ లెక్క ఉంటుంది. కానీ ప్రభుత్వం, ఉద్యోగులు ఉండవల్లి సలహాలు, సూచనలు స్వీకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. రాష్ర్టంలో పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. రోజురోజుకు అధికార పార్టీ తన ఆగడాలతో అందరితో గొడవలకే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ చొరవ ఫలిస్తుందా? లేదా చూడాలి మరి.
Also Read: మహేష్ నిర్మాణంలో వస్తున్న ‘మేజర్’ వాయిదా !