ఏపీలో ప్రతిపక్ష నేతకు భద్రత కరువైంది. సీఎం జగన్ పాలనలో చంద్రబాబుకు సైతం చేదు అనుభవం ఎదురైంది. తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేతపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఇది కలకలం రేపింది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తున్న చంద్రబాబు పై తిరుపతిలో రాళ్ల దాడి చేశారు. రాత్రి అయిన చీకట్లో గుర్తు తెలియని దుండగులు బాబును లక్ష్యంగా చేసుకొని రాళ్లు విసిరారు.
ఈ రాళ్ల దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం దిగి రోడ్డుపై బైటాయించారు.
జడ్ కేటగిరి భద్రత ఉండే తనకే రక్షణ కల్పించలేని పోలీసులు ఏపీ ప్రజలకు ఎలా కల్పిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ చంద్రబాబు ఆందోళన బాట పట్టారు. రోడ్డు పై బైటాయించి ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు. టీడీపీ శ్రేణులు మద్దతుగా రోడ్డుపై బైటాయించాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.