https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. మద్యం చోరి

కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. ఈనేపథ్యంలో ప్రజారవాణా స్తంభించిపోయింది. అలాగే వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు, వైన్ షాపులు మూతపడ్డాయి. లాక్డౌన్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో మందుబాబులకు మద్యం దొరకక అల్లాడిపోతున్నారు. కొంతమంది పిచ్చి చేష్టలతో ఆసుత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. లాక్డౌన్ నేపథ్యంలో రెండు వారాల నుంచి వైన్ షాపులు తెరవడం లేదు. మద్యం దొరకక కొందరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 4, 2020 / 08:19 PM IST
    Follow us on


    కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. ఈనేపథ్యంలో ప్రజారవాణా స్తంభించిపోయింది. అలాగే వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు, వైన్ షాపులు మూతపడ్డాయి. లాక్డౌన్ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో మందుబాబులకు మద్యం దొరకక అల్లాడిపోతున్నారు. కొంతమంది పిచ్చి చేష్టలతో ఆసుత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి.

    లాక్డౌన్ నేపథ్యంలో రెండు వారాల నుంచి వైన్ షాపులు తెరవడం లేదు. మద్యం దొరకక కొందరు మద్యంషాపుల్లో చోరికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర వైన్ షాపులో శుక్రవారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని దుండగులు వైన్ షాపు వెనుక భాగంలోని రేకులను తొలగించి లోపలికి వెళ్లారు. వైన్ షాపులోని పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారుగా లక్ష రూపాయాలు ఉంటుందని సమాచారం. అలాగే షాపు డ్రాలో ఉన్న రూ.15వేల డబ్బును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

    విషయం తెలుసుకున్న పోలీసులు మద్యం షాపులోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీని ఆధారంగా ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ చోరీకి పాల్పడింది మద్యంబాబులా? లేక ఎవరైనా మద్యాన్ని బ్లాక్‌లో అమ్ముకునేందుకు చేసారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.