Tollywood Heroes Politics: నిత్యం బిజీగా ఉండే ప్రేక్షకులకు సినిమా వినోదాన్ని పంచుతుంది. ఆడియన్స్ కు అభిరుచికి అనుగుణంగా డైరెక్టర్లు రకరకాల కథలతో సినిమాలు తీసి ఆకట్టుకుంటారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ లతో ఎమోషన్ తెప్పిస్తారు. ఈమధ్య సినీ ఆడియన్స్ ఎక్కువగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలపై ఇంట్రెస్టు చూపుతున్నారు. వారికి అనుగుణంగా కొందరు డైరెక్టర్లు కేవలం ఇలాంటి సినిమాలే తీసి ఇంప్రెస్ చేస్తున్నారు. అలనాటి నుంచి రాజకీయ నేపథ్యంలో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఎంతో కొంత పొలిటికల్ స్టోరీని యాడ్ చేస్తున్నారు. అయితే రాబోయే చిత్రాల్లో ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి కొత్తగా వచ్చిన హీరోల వరకు ఇలాంటి సినిమాలే చేస్తున్నారు. మరి ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.
గాడ్ ఫాదర్: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు పొలిటికల్ నేపథ్యంలో ఉన్న చాలా సినిమాల్లో నటించారు. ఆయన రాబోయే చిత్రం గాడ్ ఫాదర్ చిత్రం ఇలాంటి కోవకు చెందినదేనని అంటున్నారు. మోహన్ రాజా డైరెక్షన్లో వస్తున్న ఇందులో చిరు జనజాగృతి పార్టీ లీడర్ గా కనిపించబోతున్నాడట. మలయాళం మూవీ రీమేక్ అయిన ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి సంబంధించి గ్లిమ్స్ ఇటీవలే రిలీజ్ అయింది.
Also Read: Bigg Boss Telugu 6: బిగ్ బాస్ కొత్త సీజన్ కు.. జబర్దస్త్ పై టార్గెట్.. బిగ్ ప్లాన్?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పొలిటికల్ నేపథ్యంలోనే ఉంటుందని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఒక్కడు సినిమా సీక్వెల్ అని అంటున్నారు. ఇందులో అభ్యుదయ పార్టీ లీడర్ గా చరన్ కనిపించబోతున్నాడట. ఈ సినిమా కోససం చరణ్ లుక్ నే మార్చేశారు. ఇటీవల సైకిల్ వెళ్తున్న చరణ్ ఫొటో లీక్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో రాజకీయ నేపథ్యంలో ఉన్న చాలా సినిమాల్లో నటించారు. తాజాగా ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని అంటున్నారు.‘నాగ’ సినిమాల్లో స్టూడెంట్ లీడర్ గా కనిపించిన ఎన్టీఆర్ మళ్ల ఇన్నేళ్ల తరువాత రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు.
‘అఖండ’ సినిమా సక్సెస్ తో మంచి ఊపుమీదున్న బాలకృష్ణ మరో మాస్ సినిమా చేయబోతున్నాడు. బ్లాక్ షర్ట్, లుంగీపై కనిపించిన బాలయ్య ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కన్నడలో వచ్చిన రీమేక్ ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటించనున్నారు.
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమాలో పవన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉండబోతుంది.
నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రాబోతుంది. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యమున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఎన్నికల అధికారిగా నితిన్ కనిపించబోతున్నాడు.
ఉప్పెన, కొండపొలం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య డైరెక్షన్లో ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వైష్ణవ్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.
Also Read:RRR Movie Criticisms: రోత.. క్రియేటివిటీనే ఆర్‌ఆర్‌ఆర్.. గొంతెత్తునున్న సినీ విమర్శకులు!
Recommended videos