Sri Lanka Financial Crisis: కిలో చికెన్ రూ.1000, ఒక్కో గుడ్డు రూ.35, కిలో ఉల్లిపాయలు రూ.250.. మీరు చూస్తున్నది నిజమే. శ్రీలంక దేశంలోని ధరల పరిస్థితి ఇలా ఉంది. దేశంలో ఒకేసారి ధరలు భగ్గుమనడంతో ఆర్థిక పరిస్థితి ఆందోళనగా మారింది. నిత్యావరసరాలు కొనుక్కునేందుకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశీ మారక ద్రవ్య విలువలు కూడా విపరీతంగా పెరగింది. శ్రీలంక దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 1970లో కూడా ఇలాంటి కరువు ఏర్పడిందని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో సిరిమావో బండారు నాయకే ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ఉన్న సంక్షోభం అప్పటి కంటే దారుణంగా ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏర్పడిన కరువుతో కేవలం పేదలే కాదు ధనవంతులు కూడా నిత్యావసరాల కోసం అల్లాడుతున్నారు.
నిత్యావరసరాల ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలోని చాలా వరకు రెస్టారెంట్లను మూసివేశారు. హోటళ్లు అక్కడక్కడా మాత్రమే నడుస్తున్నాయి. గ్యాస్ ధర కూడా అందనంత ఎత్తులో ధర పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ ను వినియోగించడం లేదు. కట్టెల పొయ్యి వాడుతున్నారు. ‘మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే రెస్టారెంట్లన్నీ మూతపడుతాయి’ అని స్థానిక రెస్టారెంట్స్ అసోసియేషన్ అధికారి అసేలా సంపత్ అన్నారు. రెస్టారెంట్ల పరిస్థితి ఇలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Victory Venkatesh New Movie: కొత్త కాంబినేషన్.. మరి వర్కౌట్ అవుతుందా ?
రెస్టారెంట్లతో పాటు ఇళ్లలోనూ నిత్యావసరంగా మారిన గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరగింది. దీంతో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు బంకుల దగ్గర క్యూలు కడుతున్నారు. కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు లైన్లో ఉంటే తప్ప గ్యాస్ దొరకడం లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే రాను రాను బతికేదెట్లా అని ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ ప్రభావం ఆటోరిక్షా, ఇతర వాహనాలు నడిపే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ధరల ప్రభావం విద్యుత్ సరఫరాపై కూడా పడింది. ప్రతి రోజూ కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా కొనసాగడం లేదు. దీంతో వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇళ్లల్లోనూ విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లేనప్పుడు జనరేటర్లు వాడుతామని అనుకుంటున్న సమయంలో ఇంధన ధరలు కూడా పెరగడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఈ సంక్షోభం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేమని కొందరు విశ్లేషకులు వాపోతున్నారు.
అయితే శ్రీలంకలో ఈ పరిస్థితి రావడానికి అనేక కారణాలు చెబుతున్నాయి. ప్రధానంగా సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే ధరలు పెరిగాయని అంటున్నారు. దేశంలో స్థిరమైన ఆదాయం లేక ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. దీంతో సరళమైన విదేశీ మారక రేటును ప్రవేశపెట్టాలని సెంట్రల్ బ్యాంకు నిర్ణయించింది. దేశంలో ఏర్పడిన డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో లాక్డౌన్ తో కుదైలైన శ్రీలంక ఇప్పుడు ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతోంది.
Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ తో చేస్తున్న సినిమా పై రాజమౌళి క్లారిటీ
Recommended Video: