Visakhapatnam YCP: విశాఖ నగరంలో అధికార వైసీపీ కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. అధిష్టానానికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరించిన ఎంపీ విజయ సాయిరెడ్డి ని ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. కానీ విజయసాయి వెళుతూ వెళుతూ నేతల మధ్య అనైక్యత స్రుష్టించి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది. నగరంలో నాలుగు నియోజకవర్గాలకుగాను అన్ని స్థానాలు టీడీపీ చేతులోనే ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గ ఎమ్మల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే వైసీపీ పంచన చేరారు. మిగతా మూడు నియోజకవర్గాల్లో టీడీపీ బలీయమైన శక్తిగా ఉంది.

ఈ నియోజకవర్గాలను ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా కొత్తగా విభేదాలు వెలుగుచూస్తుండడం నేతలకు కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం తెలుగుదేశం చేతిలో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. 2019లో మళ్ళ విజయప్రసాద్ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయనకు వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో ఆయన పై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆయన సతమతమవుతున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు కూడ మొదలయ్యాయి. దీనిని ఆదునుగా చూసుకుని, నియోజకవర్గంపై కొత్తవారికి ఆశలు మొదలయ్యాయి.
Also Read: Richa Gangopadhyay: ఆ స్టార్ హీరో వల్లే సినీ ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ రిచా?
ఎవరి ప్రయత్నాల్లో వారు..
కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు, మళ్ళ విజయప్రసాద్ అనుచరుడు దొడ్డి కిరణ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారుట. డిప్యూటి మేయర్ జియాన్ శ్రీధర్ కూడా నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. వైసీపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీధరే ముందుండి నడిపిస్తున్నారు. పైగా గడప గడపకు ముందుండి నడిపించమని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశం అందిందని సమాచారం. ఈ విషయం తెలుసుకుని మళ్ల విజయప్రసాద్ కంగుతిన్నారని సమాచారం. వెంటనే స్థానికంగా ఉన్న నేతలు, కార్పోరేటర్లతో సమావేశమై, విజయ్ ప్రసాద్ ఆధ్వర్యంలోనే గడప గడపకు కోనసాగుతుందని ప్రకటించే వరకు ఆ కార్యక్రమానికి వెళ్లకూడదని, నిర్ణయించారు.
కొత్తగా ఆశావహులు..
అయితే శ్రీధర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కానీ క్యాడర్ ఆయన వెంట వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. త్వరలోనే ఈ పంచాయితీపై వై వి సుబ్బారెడ్డి మాట్లాడతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర, బీసిలు ఆధికంగా ఉంటారు. ఈ సారి కాపు సామాజికవర్గానికి ప్రాధానయం కల్పించాలనే ఉద్దేశంతో స్ట్రేటజీ మార్చారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇదే నియోజికవర్గం నుండి గంటా అనుచరుడిగా ఉండి వైకాపాలోకి వచ్చిన కాశీవిశ్వనాథ్ కూడా పార్టీ టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వైసీపీ హైకమాండ్ ఎవరిని దువ్వుతుందో, ఎవరికి అభయమిస్తుందో చూడాలి.
Also Read:Samantha- Preetham Jukalker: ఎన్ని విమర్శలు వచ్చినా అతన్ని వదలనంటున్న సమంత!
Recommended Videos
[…] […]
[…] […]
[…] […]
[…] […]