Spielplatz Village: బట్టల్లేని గ్రామంలోకి నగ్నంగా ఎంట్రీ ఇస్తారా?

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. వాటిని మనం ఎన్నో చూస్తున్నాం. వింటున్నాం. పూర్వ కాలంలో ఆదిమానవుడు బట్టలు లేకుండా ఉన్నారని చదువుకున్నాం. తరువాత పరిణామక్రమంలో ఎన్నో మార్పులు జరిగాయని తెలుసుకున్నాం. మనుషుల ప్రవర్తనలో విచిత్రమైన పద్ధతులు ఉంటాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన ఆచారాలు ఇంకా కనిపిస్తున్నాయి. పురాతనమైన వాటిని ఇంకా పాటిస్తూ నాగరికతకు దూరంగా ఉంటున్న కుటుంబాలు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆచారాలు, అలవాట్లు గురించి తెలుసుకుని అందరు […]

Written By: Srinivas, Updated On : August 18, 2021 1:19 pm
Follow us on

ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. వాటిని మనం ఎన్నో చూస్తున్నాం. వింటున్నాం. పూర్వ కాలంలో ఆదిమానవుడు బట్టలు లేకుండా ఉన్నారని చదువుకున్నాం. తరువాత పరిణామక్రమంలో ఎన్నో మార్పులు జరిగాయని తెలుసుకున్నాం. మనుషుల ప్రవర్తనలో విచిత్రమైన పద్ధతులు ఉంటాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన ఆచారాలు ఇంకా కనిపిస్తున్నాయి. పురాతనమైన వాటిని ఇంకా పాటిస్తూ నాగరికతకు దూరంగా ఉంటున్న కుటుంబాలు ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి ఆచారాలు, అలవాట్లు గురించి తెలుసుకుని అందరు అవాక్కు అవుతున్నారు.

ప్రపంచంలో ఓ వింతైన గ్రామం ఉంది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లోని హెర్ట్ ఫోర్ట్ షైర్ లో ఈ గ్రామం ఉంటుంది. దీని పేరు స్పీల్ ప్లాట్జ్. ఇక్కడ ఓ ఆచారం ఉంది. 85 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు బట్టలు లేకుండా ఉంటున్నారు. వీరు విద్యావంతులే. సంపద కూడా ఎక్కువైనా వారిలో ఈ ఆచారం ఉండడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అంటే నిజమే ఇక్కడ ఇలాంటి ఆచారం ఉందని తెలుసుకుని చాలా మంది నిర్ఘాంతపోతున్నారు.

పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ బట్టలు లేకుండానే ఉంటున్నారు. దీంతో ఇందులో గొప్ప విషయం ఏమిటంటే వీరి జీవన విధానం గురించి వారే గొప్పగా భావిస్తుంటారు. ఈ ఊరును ఇసుల్ట్ రిచర్డ్సన్ 1929లో కనుగొన్నారు. ఆయన గ్రామాన్ని కనుగొన్నప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారు. పబ్, స్విమ్మింగ్ ఫూల్, క్లబ్ సౌకర్యాలు ఉండడంతో ఈ ఊరును చూడటానికి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందే.

ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళితే మాత్రం దుస్తులు ధరిస్తారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత బట్టలు తీసేస్తారు. ప్రజలు మాత్రం ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తారు. ఎవరైనా దుస్తులు ధరించాలనుకుంటే వారికి ఏ రకమైన ఇబ్బందులు సృష్టించరు. వీరి అలవాట్లను అక్కడి ప్రజలు, సామాజిక సంస్థలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అక్కడి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా చర్చలు కూడా జరుగుతుంటాయి. కానీ ఎన్ని ఆందోళనలు జరిగినా అక్కడి ప్రజల అలవాట్లు, ఆచారాల్లో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకుంటున్నారు.