https://oktelugu.com/

Sharanya lyer : ఒక సంవత్సరంలో ₹ 50 లక్షలు ఖర్చు.. జస్ట్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కు ఇంత సంపాదన ఎక్కడిది?

ట్రావెల్ (travel) కంటెంట్ సృష్టికర్త (influencer) శరణ్య అయ్యర్ (sharanya iyer) గురించి చాలా మందికి తెలిసిందే. ఇక ఈమె దేశాలన్నీ చుడుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 8, 2025 / 07:00 AM IST

    Sharanya lyer

    Follow us on

    Sharanya lyer : ట్రావెల్ (travel) కంటెంట్ సృష్టికర్త (influencer) శరణ్య అయ్యర్ (sharanya iyer) గురించి చాలా మందికి తెలిసిందే. ఇక ఈమె దేశాలన్నీ చుడుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ఈ వీడియోలతో ఫుల్ గా సంపాదిస్తుంది కూడా. అయితే వచ్చిన డబ్బులో గతేడాది రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇంతకు ముందు ఆమె డబ్బు ఆదా చేసేదట కానీ ఇప్పుడు ఆమె ఈ ఆలోచనను మార్చిందని అంటున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్ మిలియన్‌కు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న శరణ్య తన డబ్బులో ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఖర్చు చేస్తుందట. తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రకారం, 2024లో ఆరు కంటే ఎక్కువ దేశాలకు వెళ్లింది. కంటెంట్ సృష్టికర్త కేవలం విమానాల కోసం ₹5 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం వసతి, ఆహారం, కార్యకలాపాలు మొదలైన వాటికి ఖర్చు చేశారు. ఇక ఈ మొత్తం కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ల ద్వారానే సంపాదిస్తుందట కూడా.

    అయితే, ట్రిప్‌తో పాటు, శరణ్య కొత్త హ్యుందాయ్ కారు కొనుగోలు చేసింది. దీని కోసం ₹22 లక్షలు ఖర్చు చేసింది. ఇక వైద్య ఖర్చుల కోసం ₹5 లక్షలు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో తను ఓ పోస్ట్ కూడా చేసింది. ‘నేను చాలా ఆదా చేసేదాన్ని. ‘పెద్ద’ విషయాలపై చాలా తక్కువ ఖర్చు చేస్తాను. మా నాన్న, స్నేహితుల సలహాతో 2024లో అంతా మారిపోయింది. పొదుపు కాకుండా ఖర్చు చేయడం నేర్చుకుంటే ఆనందం, భద్రత వస్తున్నాయి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు అందరూ దీనితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ ఇది గత సంవత్సరం నాకు ఒక ముఖ్యమైన దశ అంటూ తెలిపింది. గత సంవత్సరంలో నాకు చాలా ఆనందాన్ని, భద్రతా భావాన్ని తెచ్చిపెట్టింది అంటూ రాసుకొచ్చింది శరణ్య.

    సంవత్సరంలో ₹50 లక్షలు ఖర్చు చేయడం
    శరణ్య ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రకారం, ఆమె లావోస్, థాయ్‌లాండ్ పర్యటనకు ₹1 లక్ష, మదీరాలో ₹1.5 లక్షలు, తన తల్లిదండ్రులతో దక్షిణాఫ్రికా పర్యటనకు ₹8 లక్షలు, గ్రీన్‌ల్యాండ్‌లో ₹3 ఖర్చు చేసింది. అంటే మొత్తం మీద లక్షలు వెచ్చించింది అన్నమాట. ఐస్‌లాండ్‌కు మూడు ట్రిప్పుల్లో ₹2.5 లక్షల వెచ్చించిందట. అదనంగా, వేసవిలో యూరప్‌లో గడిపింది. కాసినోలో ₹40,000 గెలిచినందున ధర కేవలం ₹60,000 మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాలకు విమాన ప్రయాణం ₹5 లక్షలు. అదనంగా, శరణ్య కొత్త కారు కోసం ₹22 లక్షలు, వైద్య చికిత్స కోసం ₹5 లక్షలు ఖర్చు చేసింది.

    ఇక ఈ లెక్కల్లో ఆహారం, రోజువారీ జీవన ఖర్చులు, షాపింగ్ ఖర్చులు లేవు. ఖచ్చితంగా F&B ఖర్చులు, రోజువారీ ఖర్చులు, ఇతర ఖర్చులు (ఈ సంవత్సరం కూడా తగ్గించడానికి పెద్ద ప్రణాళిక!) వంటివి లేకుండానే అంత మొత్తంలో ఖర్చు వచ్చింది. “2025లో ఇంకా ఎక్కువ” అవుతుందని అనుకుంటుందట. ఇక ఈ వీడియో 1.3 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది.