Kodi Pandalu: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనంద పడిపోతుంటారు. ఎంచక్కా సొంతూళ్లకు వెళ్లి పిండి వంటకాలు చేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇకపోతే ఏపీలో సంక్రాంతి అంటే చాలు.. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ భయాల్లోనూ కోడిపందేలు జోరుగానే సాగాయి.

గతంతో పోల్చితే ఈ సారి ఎక్కువ మంది కోడి పందాలకు వచ్చారని పలువురు అంటున్నారు. అయితే, ఈ సారి కోడి పందేలకు వచ్చిన వారి డబ్బు కట్టల్లో దొంగ నోట్లు వచ్చాయని ప్రచారం సాగింది. దాంతో కోళ్ల పందేల నిర్వహణ ప్రాంతంలో దొంగ నోట్లను డిటెక్ట్ చేసే మెషిన్లు తీసుకొచ్చారు నిర్వాహకులు. అలా ఈ సారి డిఫరెంట్ గా కోడి పందేల నిర్వహణ ప్రాంతాలకు యంత్రాలు కూడా వచ్చాయి. ఇకపోతే చాలా మంది ఈ సారి డబ్బుల కట్టలతో వచ్చి ఉట్టి చేతులతో వెళ్లిపోవడం గమనార్హం.
Also Read: బిగ్ అప్డేట్.. ‘NTR30’ లాంచింగ్ డేట్ ఫిక్స్?
సంక్రాంతి సంబురాలు ఈ సారి అంబరాన్ని అంటాయి. అయితే, ఈ కోడి పందేల వ్యవహారం రాను రాను వ్యసనంగా మారిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సరదా కాస్తా.. ఇబ్బందికర పరిస్థితికి వచ్చేందని కొందరు వివరిస్తున్నారు. ఈ కోడి పందేల నిర్వహణ ప్రాంతాల్లో జూదరుల సంస్కృతి కూడా వచ్చేసిందని అంటున్నారు.
ఈ కోడి పందేలు, ఇతర జూద కార్యక్రమాల నిర్వహణ సమయంలో కమీషన్ నొక్కేసే వారు కూడా ఎదిగారని, వారికి రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతల అండ దండలు ఉన్నాయని పలువురు అంటున్నారు. ఇకపోతే ఇలానే పరిస్థితులు కొనసాగితే కనుక..ఇబ్బంది కర పరిస్థితులు వస్తాయని, ప్రజలు ఈ వ్యసనానికి బానిస అయిపోతారని వివరిస్తున్నారు. అయితే, కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ఆడటానికి అనుమతులు లేవు. కానీ, కొందరు అలా కత్తులు కట్టి మరి కోడి పందేల్లోకి దిగారని చెప్తున్నారు. అయితే, ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి సారించకుండా తన పనుల్లో తానే బిజీగా ఉందని పలువురు వివరిస్తున్నారు.
Also Read:బ్రిటీష్ వాళ్ల కోసం నిజాం రాజు కట్టిన సికింద్రాబాద్ క్లబ్ చరిత్ర తెలుసా?