https://oktelugu.com/

Huzurabad Badwel: హుజూరాబాద్, బద్వేల్ నియోజకవర్గాల స్వరూపం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అనివార్య కారణాల వల్ల ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హూజూరాబాద్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఇక ఈ స్థానాల్లో ఉప ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రెండు సిట్టింగ్ స్థానాలు కావడం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2021 10:37 am
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అనివార్య కారణాల వల్ల ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హూజూరాబాద్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఇక ఈ స్థానాల్లో ఉప ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రెండు సిట్టింగ్ స్థానాలు కావడం వల్ల మరోసారి అధికార పార్టీ అభ్యర్థుల గెలుపుకోనం ఆయా పార్టీల అధినేతలు వ్యూహ రచన చేస్తున్నారు. ఇక ఈ రెండు నియోజకవర్గాల్లోని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

    ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కరోనా కారణంగా మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. 2009 అసెంబ్లీ పునర్విభజనలో భాగంగా బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువాత 2014, 2019లో వైసీపీ నేతలు గెలుపొందారు. 1955 నుంచి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా ఆరుసార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తరువాత మూడు సార్లు గెలుపొందింది. 2004 నుంచి ఒక్కసారి కూడా టీడీపీ విజయం సాధించలేదు. వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు.

    బద్వేలు నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. ఇందులో బద్వేల్, కలసపాడు, బి. కోడూరు, పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, శ్రీ అవధూత కాశీనాయన మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,6,139 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,08, 777 ఉండగా..స్త్రీలు 1,07, 340 ఉన్నారు. 22 మంది ఇతరులు ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణం తరువాత ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఆలస్యమైంది. తాజా నోటిఫికేషన్ కు ముందే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను ప్రకటించారు. టీడీపీ నుంచి ఓబుళాపురం రాజశేఖర్ బరిలో ఉన్నారు. బీజేపీ-జనసేన కూటమి నుంచి కూడా అభ్యర్థిని దింపే ప్రయత్నం చేస్తోంది.

    తెలంగాణలోని హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో టీఆర్ఎస్ ఆయనను ఓడించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ప్రభుత్వ పథకాలతో ఆకర్షిస్తుండగా బీజేపీ ప్రభుత్వంలో ఉన్న లోపాలను గుర్తిస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

    హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,36,283 మంది ఓట్లరున్నారు. వీరిలో పురుషులు 1,17,563 ఉండగా.. స్త్రీలు 1,18, 719 ఓటర్లున్నారు. మొత్తం ఓట్లలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. దీంతో ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

    రాజకీయ ఆరంగేట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నఈటల రాజేందర్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కమలాపూర్ నియోజకవర్గం నుంచి హూజూరాబాద్ కు మారింది. 1957లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో మొత్తం 16 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు టీఆర్ఎస్, 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థుులు గెలిచారు.