
గడిచిన 40 సంవత్సరాల్లో పార్లమెంట్ లో ఒకప్పుడు కేవలం రెండు సీట్లను సాధించిన బీజేపీ ఇప్పుడు ఏకంగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. క్లియర్ కట్ గా 335 లోక్ సభ సీట్లను సాధించి ఎవ్వరికి అందనంత బలంగా దేశంలో తయారైంది. నేడు దేశంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో.. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది. అందుకే ఈ సారి బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి బీజేపీ శ్రేణులు.
బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాలను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగఫలమే బీజేపీ బీజేపీ ఆవిర్భావానికి నాందిగా పేర్కొన్నారు.ఇప్పటికీ 40 వసంతాలు పూర్తి చేసుకొని 41వ వసంతంలోకి అడుగు పెడుతున్నామని అన్నారు.
దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయని.. కానీ దేశభక్తి, భారతీయత, సమతుల్యం, సమానత్వం సత్ర్ఫర్తన , మూల స్తంభాలుగా నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ సభ్యత్వం గల అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు.
ఇక జగన్ సర్కార్ పై కూడా సోము వీర్రాజు ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ప్రజా వ్యతిరేక పాలనను బీజేపీ మాత్రమే సమర్థవంతంగా అడ్డుకోగలదని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ దాష్టీకానికి ఎదురొడ్డి బీజేపీ పోరాడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలు, సేవలతో పా్టీ పలు విజయాలు సాధించిందని.. 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికాంలోకి వస్తుందని తెలిపాు. బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, పిడి పార్థసారథి, దేవానంద్, తదితరులు పాల్గొన్నారు.