Homeఆంధ్రప్రదేశ్‌Somu Veerraju- Jagan: అదును చూసి వైసీపీ సర్కార్ ను దెబ్బకొట్టిన బీజేపీ చీఫ్ సోము...

Somu Veerraju- Jagan: అదును చూసి వైసీపీ సర్కార్ ను దెబ్బకొట్టిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. డిఫెన్స్ లో జగన్

Somu Veerraju- Jagan: ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. అధికార పార్టీపై పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా అధికార పార్టీ నేతల అవినీతి, భూకబ్జాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించింది. జగన్ సర్కారును ఇరుకున పెట్టేందుకు పక్కా ప్లాన్ వేసింది. గత ఎన్నికల తరువాత తమతో విభేదించిన టీడీపీపై గెలుపొందిన వైసీపీ స్నేహపూర్వక పార్టీగా మారింది. వైసీపీ, బీజేపీ ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నాయి. అలాగని వారు మిత్రులుగా చెప్పుకోవడం లేదు. వారి మధ్య వైరం లేదు. కానీ ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. జాతీయస్థాయిలో మేము చూసుకుంటాం. రాష్ట్రస్థాయిలో మాత్రం వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండని ఆదేశాలివ్వడంతో రాష్ట్ర బీజేపీ నేతలు స్పీడు పెంచారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు భూదందాలపై పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖలో భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కుల కబంధ హస్తాల్లో ఉన్న భూములకు నిజమైన యజమానులకు అప్పగించేలా చూడాలని కోరారు.

Somu Veerraju- Jagan
Somu Veerraju- Jagan

అయితే బీజేపీలో వచ్చిన సడెన్ చేంజ్ తో జగన్ తో పాటు అధికార వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. అయితే ఇప్పటివరకూ వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం ఉందని విపక్ష నాయకులు అనుమానిస్తూ వచ్చారు. రహస్య ఒప్పందం మేరకు ఇరుపార్టీలు నడుచుకుంటున్నాయని కామెంట్స్ చేసిన వారూ ఉన్నారు. ఉభయ పార్టీల మధ్య అంతగా స్నేహం లేకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రం సన్నిహిత సంబంధాలున్నాయంటూ అనుమానిస్తూ వచ్చారు. అనుమానాలను నిజం అనుకుందాం. అలా అయితే బీజేపీ ప్రతిపాదనకు అసలు మోక్షం కలగడం లేదు, కేవలం రుణాల కోసం అనుమతులు…అన్ని రాష్ట్రాలకు ఇచ్చే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు తప్పించి ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆమోదించిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న విశాఖ ప్రధాని పర్యటనలో ప్రత్యేక రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటికి ప్రధాని మోదీ శ్రీకారం చుడతారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ వాటి జోలికి పోకుండా కేంద్ర సంస్థలకు సంబంధించి పనులు ప్రారంభించి మోదీ వెనుదిరిగారు. వెళుతూ వెళుతూ పవన్ తో పాటు బీజేపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ వైసీపీ సర్కారుకు చికాకు తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖలో జరిగిన భూదందాపై మీడియాలో వచ్చిన కథనాలు పట్టుకొని ఇప్పుడు బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ భూముల వ్యవహారంపై అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్కాంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ ఒత్తడి చేసే ప్రయత్నం చేస్తోంది. జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అసలే వైసీపీ సర్కారుతో కృత్రిమ రాజధానిగా అవతరించిన విశాఖలో భూదందాలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారనుంది. ఇప్పుడు బీజేపీకి కావాల్సిందే అదే. భారీ ఇష్యూతో ప్రజల ముందుకెళ్లాలని భావిస్తున్న బీజేపీకి విశాఖ భూ దందా ఒక మంచి అవకాశమని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Somu Veerraju- Jagan
Somu Veerraju- Jagan

ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షు సోము వీర్రాజు నేరుగా సీఎం జగన్ కు లేఖ రాయడం ప్రకంపనలకు కారణమవుతోంది. విశాఖ నగరంతో పాటు పరిసరాలు, ఉత్తరాంధ్రలో ప్రైవేటు, ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు చెందిన స్థలాలు కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని.. దాదాపు దశాబ్దన్నర కాలంగా ఈ దందా సాగుతోంది.. ఆ భూములు అక్రమార్కుల నుంచి విడిపించి యజమానులకు అప్పగించాలని వీర్రాజు తన లేఖలో కోరారు. దీనిపై సమగ్ర విచారణకు కూడా డిమాండ్ చేశారు. దీంతో జగన్ సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది.ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలో తెలియక జగన్ మౌనాన్ని ఆశ్రయించారు. ఇటీవల భూదందా ఆరోపణలు వైసీపీ నేతలపై రావడం, సిట్ జాబితాలో మంత్రుల పేర్లు ఉండడం, పైగా విచారణ చేపడితే నాడు తన తండ్రి వైఎస్ హయాంలో కుంభకోణం జరిగిందని ఒప్పుకోవడం అవుతుందని జగన్ భయపడుతున్నారు. అటు విశాఖ నుంచి పాలన సాగించాలనుకుంటున్న తరుణంలో బీజేపీ తనను ఇరుకున పెట్టిందని తెగ బాధపడుతున్నారు. మొత్తానికైతే సరైన టైము చూసి సోము వీర్రాజు గట్టి అస్త్రమే సంధించారు. మున్ముందు ఇటువంటి అస్త్రాలు ఎన్నో బయటకు తీస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version