Homeఆంధ్రప్రదేశ్‌Somu Veerraju Fires On YCP: హిందూ వ్యతిరేక పార్టీగా వైసీపీ మారుతోందా? సోము...

Somu Veerraju Fires On YCP: హిందూ వ్యతిరేక పార్టీగా వైసీపీ మారుతోందా? సోము వీర్రాజు

Somu Veerraju Fires On YCP: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు జనసేన, బీజేపీలు విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పనులు చేస్తూ ప్రజల్లో చులకన అవుతోందన్నారు.

Somu Veerraju Fires On YCP
Somu Veerraju

కరెంటు చార్జీలు పెంచుతూ వైసీపీ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతూ మరోవైపు చార్జీలు పెంచుతూ వైసీపీ ప్రజల పక్షాన రాక్షసంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతోంది. దీనికి తాజా ఉదాహరణే శ్రీశైలంలో జరిగిన దాడిగా అభివర్ణించారు. కన్నడ భక్తులు స్థానికకులను భయభ్రాంతులకు గురిచేస్తే కనీసం వారిని ఆపకుండా చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Also Read: Half Day Schools: ఏపీలో ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలోని రామాలయంలో క్రైస్తవ మత ప్రచారం సాగుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నారు. హిందు దేవాలయాలకు రక్షణ లేకుండాపోతోందని దుయ్యబట్టారు. హిందువులను పరాయి మతస్తులుగా చూస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. జగన్ కు పాలించే సత్తా లేదని చెబుతున్నారు. ఆయన పదవి వదిలి ఇతరుకు పాలన పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Somu Veerraju Fires On YCP
Somu Veerraju

విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే అని వాపోతున్నారు. హిందూ వ్యతిరేక శక్తులకు రక్షణ కల్పిస్తూ హిందువులను హీనంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని సూచిస్తున్నారు. వైసీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అప్పుడే పాలన సక్రమంగా ఉంటుందన్నారు.

Also Read: Regional Ring Road: ఆర్ఆర్ఆర్ కు కేంద్రం సై: హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Tata IPL 2022: ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్టు అయిన ముంబై ఇండియ‌న్స్‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ఐపీఎల్ ప్ర‌తి సీజ‌న్ లో తొలి మ్యాచ్ ఓడిపోవ‌డం. ఈ జ‌ట్టు తొలి మ్యాచ్ ఓడిపోతేనే ఆ త‌ర్వాతి మ్యాచ్‌లు వ‌రుస‌గా గెలుస్తుంద‌నే సెంటిమెంట్ ను చాలా సార్లు నిజం చేసి చూపించింది. ఈ సీజ‌న్‌లో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొన్న జ‌రిగిన తొలిమ్యాచ్ లో ఓడిపోయింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular