https://oktelugu.com/

విజయసాయిరెడ్డి.. ఓ ‘క్యాబేజీ’.. సీక్రెట్ చెప్పిన సోము వీర్రాజు

‘సరైన ప్రత్యర్థి తగలనంత వరకే ఎవరైనా కింగులా ఉంటారు. కానీ ఆ ప్రత్యర్థి రాటుదేలిన వాడైతే ఇక కౌంటర్ కు ఎన్ కౌంటర్ పడిపోతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అలానే అయ్యింది. సోము వీర్రాజుపై ఆయన ఏదో కామెంట్ చేస్తే.. దానికి కౌంటర్ గా సోము వీర్రాజు వేసిన పంచ్ అదుర్స్ లా పేలింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికల వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2021 / 10:04 PM IST
    Follow us on

    ‘సరైన ప్రత్యర్థి తగలనంత వరకే ఎవరైనా కింగులా ఉంటారు. కానీ ఆ ప్రత్యర్థి రాటుదేలిన వాడైతే ఇక కౌంటర్ కు ఎన్ కౌంటర్ పడిపోతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి అలానే అయ్యింది. సోము వీర్రాజుపై ఆయన ఏదో కామెంట్ చేస్తే.. దానికి కౌంటర్ గా సోము వీర్రాజు వేసిన పంచ్ అదుర్స్ లా పేలింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

    తిరుపతి ఉప ఎన్నికల వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల తూటాలు పేలాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చాడు.. దానికి బదులుగా సోము వీర్రాజు ఏకంగా ఎన్ కౌంటర్ చేసేవాడు. విజయసాయిరెడ్డి గాలి తీసేసి నడిబజారులో నిలబెట్టేశాడు. పదునైన డైలాగులతో సోము వీర్రాజు పేల్చిన మాటల తూటాలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

    ప్రధానంగా ఇద్దరి ట్వీట్లలో ‘క్యాబేజీ’ కర్రీ మాత్రం హైలెట్ అయ్యిందనే చెప్పాలి. తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలి సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ‘‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.’’ అంటూ తన పార్టీనే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

    అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు సోము వీర్రాజు . తాజాగా సోము వీర్రాజు ట్వీట్ చేస్తూ ‘మా ఊసు ఎందుకులే విజయసాయిరెడ్డి గారూ… కోర్టులకు చెవుల్లో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్న లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీ బాబా నలభై దొంగలంతా.. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి ‘క్యాబేజీ’ పువ్వులు మీకు పంపిస్తాం. బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడుతాయి’ అని ఎన్ కౌంటర్ చేసేలా పరుష వ్యాఖ్యలను ప్రయోగించారు.

    జైల్లో ఎక్కువగా క్యాబేజీ కూరనే పెడుతారని.. అందుకే విజయసాయిరెడ్డి తన ట్వీట్లలో క్యాబేజీని గుర్తు చేస్తారని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. విజయసాయి కొద్దిరోజులు జైల్లో ఉండడంతో అదే కలవరిస్తున్నాడని.. అందుకే సోము వీర్రాజు టైం చూసి కొట్టాడని బీజేపీ నేత సత్యమూర్తి ఎద్దేవా చేశారు.