Pawan Kalyan Janasena Party : పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి ప్రసంగం ఒక విధంగా బడుగు బలహీన వర్గాలను ఒకటి చేస్తా ఉంది. రెండో వైపు ఆ ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రల మీద కుట్రలు జరుగుతున్నాయి. అధికారం రాని కులాలకు అధికారం.. బడుగు బలహీన వర్గాలకు సాధికారత.. అధికారం అనుభవించిన కులాలకు కొన్నాళ్లు అధికారానికి విరామం. దీంతోటి బడుగు బలహీన వర్గాల్లో విపరీతమైన సామాజిక చైతన్యం పెరిగింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి..
దళిత గొంతు మహాసేన రాజేశ్ కూడా పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయానికి మద్దతుగా నిలిచారు. ఇన్నాళ్ల నుంచి కాపులు ఎటువైపు మొగ్గితే వారిదే రాజ్యాధికారం.. మొన్న జీవీఎల్ మాట్లాడింది అక్షరాల సత్యం. ఏ రాష్ట్రంలో ఇంతమంది ఉన్న సామాజికవర్గం ఒక్కసారి కూడా సీఎం పోస్టులోకి రాకపోవడం అన్నది ఎక్కడా రాలేదు.
కర్నాటకలో లింగాయత్ లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఉత్తరప్రదేశ్ లో యాదవ్ లు అధికారంలోకి వచ్చారు. ఏపీలో మాత్రం కాపులు ఇంతవరకూ మెజార్టీ సంఖ్యలో ఉన్నా అధికారంలోకి రాలేదు.
జనసేన రగిల్చిన సామాజిక చైతన్యాన్ని దెబ్బతీసే కుట్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడాలి.