Sri Lanka Economic Crisis: శ్రీలంకలో ఆహార సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.దీంతో ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది. జనం రోడ్లపైకి వస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అధ్యక్షుడిని తొలగించేది లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో మే నాటికి సంక్షోభం ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశముందని తెలుస్తోంది.

శ్రీలంకలో ఎటు చూసినా తీవ్ర దుర్భిక్షమే కనిపిస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు ఎంతగా పెరిగాయంటే ఒక్క నిమ్మకాయ రూ.60 లు పలకడం చూస్తుంటే ఇక కొనేది ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఆకలి కేకలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. చిన్నపిల్లలకు పాలు సైతం దొరకని పరిస్థితి. దీనికంతటికి కారణం చైనాయే అయినా అది కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.
Also Read: AP Cabinet Expansion: ఏపీలో కొత్త మంత్రివర్గంపై కొనసాగుతున్న కసరత్తు
శ్రీలంకలో రూపాయి విలువ పడిపోయింది. దీంతో ధరలు పెరిగాయి. ఆహారం, ఔషధాలు కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఫలితంగా మనుషుల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. ఇంధన కొరత కూడా వేధిస్తోంది. దాదాపు రోజుకు 14 గంటలు విద్యుత్ కోతలు అమలు చేస్తుంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలుస్తోంది. కర్మాగారాలు పనిచేయకుండా నిలిచిపోతున్నాయి.

దేశంలో పర్యాటక రంగం కుదేలైపోయింది. ఫలితంగా ఆదాయం రాకుండా పోయింది. దీనికి తోడు కరోనా కూడా దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ క్రమంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అధ్యక్షుడు రాజపక్సే రాజీనామా చేయాలని ప్రజలు ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ లో మరింత కరువు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read:Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు