KA Paul Attack: ప్రపంచ యుద్ధాన్ని నివారించగల యోధుడు.. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ నే నియంత్రించగల వీరుడు.. ట్రంప్ ను ఆడించిన శూరుడు.. ప్రపంచంలో ఏం జరిగినా తానే చేశానని.. మోడీ, అమిత్ షా తనను కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగారని ఇలా ఎన్నెన్నో చెప్పే కేఏ పాల్ కు తెలంగాణలో తీవ్ర అవమానం ఎదురైంది.
ఈ ప్రపంచ సువార్తకుడు అని కూడా చూడకుండా.. తెలంగాణలో పంట నష్టపోయిన రైతుల పరామర్శకు వచ్చిన కేఏ పాల్ చెంప పగులకొట్టారు. అది ఎవరో కాదు మన టీఆర్ఎస్ కార్యకర్తలే కావడం విశేషం.
Also Read: Niharika: మెగా డాటర్ నిహారికకు ఏమైంది? పెళ్లి తర్వాత సంచలన నిర్ణయం
మొన్నటి ఏపీ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీచేసి సీరియస్ వాతావరణంలో కామెడీ పంచిన కేఏ పాల్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. అమెరికాలో మంచి సువార్తకుడు ఉంటూ తెలుగు రాజకీయాల్లో అప్పుడప్పుడు వేలు పెడుతుండే కేఏ పాల్ ఈ మధ్య ఏపీ రాజకీయాలు వదిలేసి తెలంగాణపై పడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ లో వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి కేటీఆర్ నియోజకవర్గానికి కేఏ పాల్ బయలు దేరారు. అసలే తెలంగాణ ప్లేవర్ ఎక్కువగా ఉండే గులాబీ శ్రేణులు.. ఈ రాజకీయ కామెడీ చేసే కేఏ పాల్ ను వదలుతారా? వదల్లేదు.
కేఏ పాల్ వస్తే పరిస్థితులు చేయిదాటుతాయని సిద్దిపేట సరిహద్దుల్లోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నాయి. పాల్ కారు దిగి పోలీసులపై ఫైర్ అవుతుండగా.. అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరు ఆయన చెంప పగులకొట్టారు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన పాల్.. డీఎస్పీ, పోలీసుల సమక్షంలోనే నన్నే కొడుతారా? అని ఊగిపోయారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక తనను కొట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Teenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న
దీంతో పోలీసులు కేఏ పాల్ ను కొట్టిన టీఆర్ఎస్ నాయకుడిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సేఫ్ గా కేఏ పాల్ ను హైదరాబాద్ కు పంపించారు. కానీ ఎక్కడా ఈగ వాలకుండా అంతా తిరిగి కామెడీ పండించిన కేఏ పాల్ కు తెలంగాణలో మాత్రం ఈ చేదు అనుభవం ఎదురుకావడం షాకింగ్ గా మారింది.