https://oktelugu.com/

Janasena Pawan: ‘జనసేనాని’ గేర్ మార్చాల్సిందేనా?

Janasena Pawan:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క అన్న అన్నట్లుగా పవన్ స్టార్ ముందుకు దూసుకెళితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు రాజకీయాలు కొత్తమీ కాదు.. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా పని చేశారు. ఆ సమయంలో ‘పంచెలూడగొడతానంటూ’ వ్యాఖ్యలు చేసి పొలిటికల్ గా సంచలనం మారిన సంగతి అందరికీ తెల్సిందే. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2022 / 02:28 PM IST
    Follow us on

    Janasena Pawan:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క అన్న అన్నట్లుగా పవన్ స్టార్ ముందుకు దూసుకెళితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు రాజకీయాలు కొత్తమీ కాదు.. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా పని చేశారు. ఆ సమయంలో ‘పంచెలూడగొడతానంటూ’ వ్యాఖ్యలు చేసి పొలిటికల్ గా సంచలనం మారిన సంగతి అందరికీ తెల్సిందే.

    Pavan Kalyan

    నాడు ప్రజారాజ్యం పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక చతికిలపడింది. నమ్మినవాళ్లే చిరంజీవిని మోసం చేయడంతో ఆయన చేసేదిలేక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రజారాజ్యం ఓటమి వెనుక అప్పుడు అనేక శక్తులు నాడు బలంగా పని చేశాయి. ఇవన్నీ కూడా పవన్ కల్యాణ్ దగ్గరుంచి చూశారు కూడా. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన లోపభూయిష్టంగా ఉందంటూ పవన్ కల్యాణ్ మండిపడుతూనే కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు.

    Also Read: Pawan Kalyan: పవన్ స్టార్‌ గానే కాదు, వ్యక్తిగానూ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడు !

    2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. నాటి పరిస్థితుల రీత్యా పవన్ కల్యాణ్ ఎంతో ఆవేశంతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చిలీపోకుడదనే కారణంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. టీడీపీ, బీజేపీకి కూటమికి మద్దతుగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చానా ఏనాడూ పదవులు తీసుకోలేదు. అదే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ రెండు పార్టీలకు కంటగింపుగా మారారు.

    2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీలతో పోటీ చేసినా ఫలితం రాలేదు. పవన్ పోటీ చేసినా రెండుచోట్ల ఓటమికాగా జనసేన కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత వైసీపీలో చేరిపోయాయి. అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడ కూడా వెనుకాడుగు వేయలేదు. అభిమానులు, ప్రజలు ఎన్నికల్లో తనను పెద్దగా ఆదరించకపోయినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఏమాత్రం జడవకుండా ముందుకెళుతున్నారు.

    2019 ఎన్నికల్లో జనసేన రెండుచోట్ల ఓడిపోవడం ఆపార్టీ నేతలను మానసికంగా దెబ్బతీసింది. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ దాదాపు 300కోట్ల రూపాయాల మేర ఖర్చు చేసిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు సైతం ఆ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేయకపోవడం పవన్ కల్యాణ్ ను కొంత ఖుంగదీసింది. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ మునిపటిలా కాకుండా కొంత ఆచితూచి ముందుకెళుతున్నారు.

    గతంలో ఉన్న ఆవేశం ప్రస్తుతం పవన్ కల్యాణ్ లో కన్పిచడం లేదని జనసైనికులే అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ మరీ అంతా సాఫ్ట్ గా కాకుండా ఫైర్ చూపించేస్తే జనసేనకు భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ రోజు ఆవిర్భావ సభలో జనసేనాని ప్రసంగం గతంలో మాదిరిగా ఆవేశంతో ఉంటుందా? లేదా ఆలోచనతో ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ఏదిఏమైనా జనసేనాని గేర్ మార్చాల్సిన సమయం మాత్రం ఆసన్నమైందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా విన్పిస్తోంది.

    Also Read: Vijayasai Reddy: ఏపీ ఆర్థికమంత్రిగా విజయసాయిరెడ్డి.. జగన్ సంచలనం?