Shinzo Abe: తుపాకీ కాల్పుల సంస్కృతి జపాన్ కు కూడా పాకింది. మనుషుల ప్రాణాలు తీయడంలో తుపాకుల పాత్ర కీలకమని తెలుసుకుని వాటిని వినియోగిస్తూ మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల్లో ప్రాణనష్టం జరిగినట్లు తెలిసిందే. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి దాదాపు ఇరవై మంది గాయపడిన సంఘటన మనకు విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం జపాన్ లో కూడా ఇలాంటి ఘటనే జరగడం సంచలనం సృష్టిస్తోంది.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఆయనకు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. అక్కడున్న వారు మాత్రం తుపాకీ శబ్ధం వినిపించిందని తెలపడం సంచలనం కలిగించింది. శుక్రవారం నరా నగరంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆయన విచ్చేశారు. కానీ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అందరు హతాశులయ్యారు. షింజోకు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు.
Also Read: Eesha Rebba: బెడ్ పై పడుకుని షర్ట్ విప్పేసిన ‘ఈషా రెబ్బా’.. వాటి కోసమే
షింజోపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన శరీరం నుంచి రక్తం కారుతున్నట్లు తెలియడంతో కాల్పుల కలకలం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ శబ్ధం మాత్రం వినిపించలేదు. దీంతో షింజోకు ఏం జరిగి ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయనను మాత్రం ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్నారు. కాల్పులు జరిపిన అనుమానితుడి కోసం అన్వేషణ చేస్తున్నారు.

కాల్పులకు తెగబడినట్లు ఒకరిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ షింజో ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన కదలడం లేదని తెలుస్తోంది. దీంతో షింజో ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు. ఆయనకు ఏం జరగొద్దని వేడుకుంటున్నారు. తమ ప్రియతమ నేత ప్రాణాలతో ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ మేరకు పూజలు సైతం చేస్తున్నట్లు సమాచారం. దీంతో జపాన్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు.
Also Read:Senior Hero Naresh Marriage Life: ముగ్గురు భార్యలతో ముగ్గురు పిల్లలు..మూడో భార్యను నరేశ్ వదలలేదా?