Gold Price Today : గత కొన్ని రోజుల క్రితం నుంచి తగ్గినట్లే కనిపిస్తున్న బంగారం ధరలు మళ్ళీ జూన్ నెల ప్రారంభంలో భారీగా పెరుగుతున్నాయి. మరోసారి తులం బంగారం ధర ఆల్ టైం గరిష్ట రికార్డుకు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర లక్షకు చేరువలో ఉంది. భారతీయ మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మహిళలు ఎక్కువగా ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా వేడుక ఏదైనా సరే ముందుగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. అటువంటి సమయాలలో మార్కెట్లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నా కూడా కొనక తప్పదు. ఎందుకంటే బంగారం మన దేశ సంప్రదాయాలto ముడిపడి ఉంది. దీనిని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాదు మంచి పెట్టుబడిగా కూడా చాలామంది భావిస్తారు. ఈ క్రమంలో చాలామంది బంగారం తో పాటు వెండిలో కూడా పెట్టుబడి చేస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు వీటి ధరల గురించి తెలుసుకుంటూ ఉంటారు. అయితే ప్రాంతాలను బట్టి వీటి ధరలలో వ్యత్యాసం ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా మనదేశంలో కూడా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, వరంగల్ వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.99,070, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.90,810 గా ఉంది.
ఇక దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నై, కేరళ, బెంగళూరు వంటి నగరాలలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.99,070, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర నేడు రూ.90,810 గా ఉన్నాయి.
ఇక ఈరోజు దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.1,00,200 గా ఉంది.
Also Read : బంగారం ప్రియులకు షాక్.. ఈరోజు ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..