E.D Raids In Telangana: తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కరీంనగర్ గ్రానైట్ మాఫియా పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రయోగించింది. ఫలితంగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కు చెందిన కంపెనీలతోపాటు, హైదరాబాద్, కరీంనగర్ లోని సంస్థలు విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలను అతిక్రమించినట్లు రూడీ అయింది. ఈ సంస్థలు చైనా, హాంకాంగ్ తో పాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయాల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్ ఎగుమతి చేసినట్టు ఈడి నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్టు గుర్తించింది. ఇక చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాలోకి పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్టు గుర్తించారు. అంతర్జాతీయంగా దారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లీవెన్ హ్యూ పేరు కూడా ఉండటం గమనార్హం.

ఈ కంపెనీలోనే సోదాలు చేసింది
శ్వేతా గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పి ఎస్ ఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ఆయా సంస్థలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్లో రెండు రోజులపాటు ఈడీ ప్రత్యేక హోదాలో సోదరులు నిర్వహించాయి. ఆయా గ్రానైట్ కంపెనీలో పని చేసే వారి బినామీ ఖాతాల్లోకి చైనా, హాంగ్కాంగ్ తోపాటు ఇతర దేశాల నుంచి ఆయా ఖాతాల్లోకి వచ్చిన నగదు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకుండా చేతి బదులు తీసుకున్నట్టు చెబుతున్నారని, అది ఎలా సాధ్యమవుతుందని వీడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. గ్రానైట్ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో లెక్కలోలేని 1.08 కోట్ల నగదు తో పాటు పది సంవత్సరాలుగా గ్రానైట్ ఎగుమతులకు సంబంధించిన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే..

రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగానే సోదరులు నిర్వహించామని ఈడి అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 29 2013లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అప్రైజల్ నివేదిక ప్రకారం 7, 68, 889. 937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడి వెల్లడించింది. ప్రభుత్వానికి ఎగ్గొట్టిన సీనరేజీ ఫీజు ₹124, 94, 46, 147 , ఎగ్గొట్టిన పెనాల్టీ 624, 72, 30, 735 రెండు కలిపి మొత్తం 729,66,76,882 గా తేల్చింది. అప్పటి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కరీంనగర్లోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సముద్ర మార్గంలో రవాణా చేసిన గ్రానైట్ బ్లాక్ లపై పెద్ద ఎత్తున సీనరేజీ ఫీజు ఎగవేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ నివేదిక మేరకు అక్రమ గ్రానైట్ మైనింగ్, ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఈడి అధికారులు వెల్లడించారు.