https://oktelugu.com/

కాంగ్రెస్, రేవంత్ కు షాక్: సంచలన ఆడియో లీక్

రేవంత్ రెడ్డికి తొలి షాక్ తగిలింది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు అందుకున్నాక జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నిలబెడుదామన్న ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. కాంగ్రెస్ కు షాకిస్తూ ఆ నియోజకవర్గ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ పరిణామం హుజూరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు గట్టి షాక్ లా పరిణమించింది. పోయిన 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 12, 2021 / 10:50 AM IST
    Follow us on

    రేవంత్ రెడ్డికి తొలి షాక్ తగిలింది. పీసీసీ చీఫ్ గా పగ్గాలు అందుకున్నాక జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నిలబెడుదామన్న ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి. కాంగ్రెస్ కు షాకిస్తూ ఆ నియోజకవర్గ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ పరిణామం హుజూరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు గట్టి షాక్ లా పరిణమించింది.

    పోయిన 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు గట్టి పోటీనిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డి. దాదాపు ఓడించినంత పనిచేశాడు. రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే మూడు సార్లు ఓడిపోయిన సానుభూతి అతడిపై ఉంది. సో ఈసారి విజయం తథ్యమని ధీమాగా ఉన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చాడు.

    ఓ టీఆర్ఎస్ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. మాదన్నపేటకు చెందిన విజేందర్ అనే టీఆర్ఎస్ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. ‘హుజూరాబాద్ టికెట్ తనకే ఖాయమైనట్లు అందులో కౌశిక్ రెడ్డి తెలిపారు.యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.4-5 వేలు ఇస్తానని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజేందర్ కు కౌశిక్ రెడ్డి సూచించారు.

    ఇటీవలే ప్రైవేటు కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిశారు. మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఆడియో బయటకు రావడంతో కాంగ్రెస్ ఇరుకునపడింది.

    ఇక కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ పై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. వెంటనే టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడని ఫిర్యాదులు అందాయని ఈ క్రమంలోనే నోటీజులు ఇచ్చినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. పిలిచి హెచ్చరించినా కౌశిక్ రెడ్డి మారలేదన్నారు.